ఉమ్మడి ఖమ్మం జిల్లా సమస్యల పైన కేంద్ర సహాయ మంత్రికి వినతి పత్రం అందించిన యువనేత బీపీ నాయక్

Published: Tuesday May 31, 2022
బోనకల్, మే 30 ప్రజా పాలన ప్రతినిధి: అధికార పర్యటన నిమిత్తం ఖమ్మం పట్టణానికి వచ్చిన కేంద్ర సామాజిక న్యాయ , సాధికారిత శాఖ సహాయ మంత్రివర్యులు కుమారి ప్రతిమ భూమిక్, భారతీయ జనతా పార్టీ జిల్లా అధ్యక్షులు గల్లా సత్యనారాయణ సాదరంగా ఆహ్వానించారు. పర్యటనలో భాగంగా ఉన్న మంత్రివర్యులను స్థానిక బీజేపీ యువనేత బీపీ నాయక్ సోమవారం మర్యాద పూర్వకంగా కలిసి ఉమ్మడి ఖమ్మం జిల్లా బోనకల్ మండలంలోని పలు జటిలమైన సమస్యలను పరిష్కారం కోరుతూ వినతిపత్రం సమర్పించారు. అందులో భాగంగా ఎస్సీ వర్గీకరణ, ఎస్టీ రిజర్వేషన్ల పెంపు, జిల్లాలో నమోదైన పలు అట్రాసిటీ కేసుల పురోగతి కోసం, మహిళా సాధికారత, మహిళాభివృద్ధి కార్యక్రమాల గూర్చి, గ్రామాల్లో మౌలిక సదుపాయాలు సిసి రోడ్లు, తాగునీటి సరఫరా,బోనకల్ గ్రామానికి ఐటిఐ, డిగ్రీ కాలేజ్, రైల్వే స్టేషన్ , హిందూ స్మశాన వాటికకు వెళ్ళు మార్గాలకు బిటి రోడ్డు, చిరు వ్యాపారుల నిమిత్తం జనతా మార్కెట్ కొరకు స్థలం సేకరణ, భద్రాచలంలో గిరిజన యూనివర్సిటీ, ఖమ్మం నగరంలో అంబేద్కర్ టెక్నికల్ యూనివర్సిటీ, ఉద్యోగాన్వేషణలో ఉన్న నిరుద్యోగులకు ట్రైనింగ్ సెంటర్స్, ప్లేయింగ్ గ్రౌండ్, వ్యాయామశాల, ఉన్నత విద్యాభ్యాసం చేసేవారికి స్కాలర్షిప్పులు, దివ్యాంగులకు, మానసిక లేదా శారీరక వికలాంగులకు చేయూతనిచ్చే విధంగా కొన్ని పరికరాలు ప్రణాళికల గూర్చి, అలాగే జిల్లాలో విచ్చలవిడిగా లభ్యమవుతున్న మాదకద్రవ్యాలను అరికట్టే యోచనను గూర్చి, ఎస్సీ ఎస్టీ సబ్ ప్లాన్ నిధులు సద్వినియోగం అయ్యే విధంగా
తదితర ముఖ్య అంశాలతో క్లుప్తంగా మంత్రివర్యులు ప్రతిమా భూమిక్ కి విన్నవించగా చిరునవ్వుతో స్పందించి ప్రత్యుత్తరంగా జిల్లా అధ్యక్షులు గల్లా సత్యనారాయణ, యువనేత బీపీ నాయక్ ఫోన్ నెంబర్లు అడిగి తీసుకొని బదులుగా త్వరలోనే మంచివార్త చెబుతామని మంత్రి అన్నారు. స్పందించిన మంత్రి కి నాయకులు అభినందనలు తెలిపారు.