గ్రంథాలయాలకు ఆదరణ పెఃచాలి : వికారాబాద్ ఎమ్మెల్యే డాక్టర్ మెతుకు ఆనంద్

Published: Friday August 13, 2021
వికారాబాద్ బ్యూరో 12 ఆగస్ట్ ప్రజాపాలన : గ్రంథాలయాలకు ఆదరణ పెంచే విధంగా కృషి చేయాలని వికారాబాద్ ఎమ్మెల్యే డాక్టర్ మెతుకు ఆనంద్ హితవు పలికారు. గురువారం వికారాబాద్ జిల్లా కేంద్రంలోని జిల్లా గ్రంథాలయంలో గ్రంథాలయ చైర్మన్ మురళి కృష్ణ గౌడ్ అధ్యక్షతన డాక్టర్ ఎస్.ఆర్.రంగనాథన్ జన్మదినాన్ని పురస్కరించుకొని ఏర్పాటు చేసిన కార్యక్రమానికి వికారాబాద్ ఎమ్మెల్యే డాక్టర్ మెతుకు ఆనంద్ ముఖ్యఅతిథిగా పాల్గొన్నారు. ఈ సందర్భంగా గ్రంథాలయాల లభించే విశేషమైన పుస్తకాలు ప్రతి పాఠకునికి అందుబాటులో ఉంటుందని పేర్కొన్నారు. సెల్ ఫోన్ లో లభించేే విషయ పరిజ్ఞానం కంటే గ్రంథాలయాలలో పుస్తక రూపంలో లభించే విజ్ఞానం గొప్పదని గుర్తు చేశారు. జిల్లా కేంద్ర గ్రంథాలయం లో పాఠకులకు ఏసీలు అమర్చితే పాఠకుల సంఖ్య పెరిగే అవకాశం ఉంటుందని వివరించారు వికారాబాద్ నియోజకవర్గం పరిధిలోని ప్రతి మండలానికి పాఠకుల అభిరుచికి తగ్గ పుస్తకాలుు అందుబాటులో ఉంచాలని సూచించారు. అసెంబ్లీ సమావేశాలలో విలువైన పుస్తక విషయ పరిజ్ఞానం లభించినా ఎవరు కూడా వినియోగించుకోవటం లేదని చెప్పారు పుస్తతక పఠనాన్ని అవగాహన కార్యక్రమాలు నిర్వహించాల్సిిన అవసరం ఉన్నదని పేర్కొన్నారు ఏ పుట్టటలో ఏమి ఉన్నదో అనే చందంగా ఏ మైండ్ లో ఏ ఆలోచన దాగి ఉన్నదో తెలుసుకోవడం అసాధ్యమని అన్నారు. జిల్లా గ్రంథాలయల సంస్థ చైర్మన్ మురళి కృష్ణ గౌడ్ మాట్లాడుతూ... గ్రంధాలయాలు పాఠకుల అభిరుచికి నోచుకోకపోవడంతో ఆదరణ కరువైందన్నారు. గ్రంథాలయలు క్రి.పూ నుంచి ఉండడం జరిగిందని, నలంద విశ్వవిద్యాలయంలో అప్పటి నుంచే గ్రంథాలయలు ఉన్నాయన్నారు. ఒక ఉపాధ్యాయుడు ఒక సబ్జెక్టు మాత్రమే బోధిస్తారని గ్రంధాలయంలో అన్ని పుస్తకాలు ఉంటాయన్నారు.జిల్లాలోని 18 మండలాలలోని అన్ని మండల కేంద్రాల్లో గ్రందాయాలు ఏర్పాటు చేశామన్నారు. కొడంగల్, దౌల్తాబాద్, దోమ, తాండూరు లో కొత్త భవనాలు నిర్మిస్తున్నామన్నారు. త్వరలో తెలంగాణలో 60,000 ఉద్యోగ నోటిఫికేషన్ విడుదల అవుతుందని, నిరుద్యోగులు బాగా చదివి ఉద్యోగం సాదించాలన్నారు. ఈ కార్యక్రమంలో మున్సిపల్ చైర్పర్సన్ మంజుల, జిల్లా వైస్ చైర్మన్ విజయ్ కుమార్, రాష్ట్ర నాయకులు శుభప్రద్, మాజీ జెడ్పిటిసి ముతాహర్ షరీఫ్, గ్రంథాలయ సెక్రటరీ సురేష్ బాబు, పాఠకులు తదితరులు ఉన్నారు.