దేశినేనిపాలెం గ్రామంలో ఘనంగా గుడ్ ఫ్రైడే వేడుకలు

Published: Saturday April 08, 2023

మధిర, ఏప్రిల్ 6 ప్రజా పాలన ప్రతినిధి:బయ్యారం విచారణ గురువులు ఫాదర్ జుగుంట ప్రభాకర్ ఆధ్వర్యంలో దేశినేనిపాలెం గ్రామంలో గుడ్ ఫ్రైడే వేడుకలు నిర్వహించారు.పవిత్ర తపస్సు కాలంలో భాగంగా గత 40రోజుల నుండి పవిత్ర దీక్షలు చేస్తూ, ఉపవాసాలు ఉంటూ ప్రార్థనలు జరుపుకున్న క్రైస్తవులు చివరి రోజు అయిన పవిత్ర శుక్రవారం రోజున ఏసు క్రీస్తు సిలువ శ్రమలను ఆరాధించుకుంటూ గ్రామ వీధులలో సిలువను మోస్తూ, సిలువ మార్గాన్ని నిర్వహించారు. ఈ కార్యక్రమంలో దీక్షాపరులు, సంఘ పెద్దలు , సంఘస్తులు అధిక సంఖ్యలో పాల్గొన్నారు.