వెనుకబడిన వర్గాల అభ్యున్నతికి అహర్నిశలు కృషి చేసిన గొప్ప సంఘ సంస్కర్త బాబూ జగ్జీవన్ రాం. జడ

Published: Wednesday April 06, 2022
మధిర ఏప్రిల్ 5 ప్రజా ప్రతినిధి మున్సిపాలిటీ పరిధిలో మంగళవారం నాడు టిఆర్ఎస్ కార్యాలయంలో ముఖ్య అతిధి జడ్పీ చైర్మన్  లింగాల కమల్ రాజు పాల్గొని జగ్జీవన్ రావు జయంతి వేడుకలు ఘనంగా నిర్వహించారు ఈ సందర్భంగా వారు మాట్లాడుతూపలు హోదాల్లో జీవితాంతం ప్రజా సేవలో ఉన్న ప్రజా నాయకులు బాబూ జగ్జీవన్ రాం జయంతి సందర్భంగా ఘనంగా నివాళులర్పించిన జడ్పీ చైర్మన్ లింగాల కమల్ రాజు వెనుకబడిన వర్గాల అభ్యున్నతికి అహర్నిశలు కృషి చేసిన గొప్ప సంఘ సంస్కర్త బాబూ జగ్జీవన్ రాం అని జడ్పీ చైర్మన్ లింగాల కమల్ రాజు గారు పేర్కొన్నారు. మంగళవారం నాడు బాబూ జగ్జీవన్ రాం 115వ జయంతి సందర్భంగా మధిర పట్టణంలోని టిఆర్ఎస్ పార్టీ కార్యాలయంలో జరిగిన కార్యక్రమంలో ఆయన పాల్గొని జగ్జీవన్ రాం చిత్రపటానికి పూలు వేసి ఘనంగా నివాళులర్పించారు అనంతరం ఆయన మాట్లాడుతూ భారత పార్లమెంట్ లో నలభై ఏళ్లు పాటు వివిధ మంత్రి పదవులు నిర్వహించడమే కాకుండా ఉప ప్రధానిగా కూడా ఆయన సేవలు అందించిన విషయాన్ని ఈ సందర్భంగా ఆయన గుర్తు చేశారు. అంటరాని వారికి సమానత్వం కోసం అంకితమైన ఆల్ ఇండియా డిప్రెస్డ్ క్లాసెస్ లీగ్ అనే సంస్థ ఏర్పాటుకు బాబూ జగ్జీవన్ రాం కీలకపాత్ర పోషించారని పేర్కొన్నారు. జవహర్ లాల్ నెహ్రూ తాత్కాలిక ప్రభుత్వంలో అతి పిన్న వయస్కుడైన మంత్రిగా ఆయన బాధ్యతలు చేపట్టారని గుర్తు చేశారు బాబుజీ గా ఆప్యాయంగా పిలవబడే బాబూ జగ్జీవన్ రాం దేశ స్వేచ్ఛ కోసం పోరాడుతూ అణగారిన వర్గాల కోసం చేసిన పోరాటాలు చరిత్రలో నిలిచిపోతాయని తెలిపారు. భారత రాజ్యాంగ సభ్యులు గా కూడా ఎన్నో విప్లవాత్మకమైన మార్పులకు ఆయన శ్రీకారం చుట్టారని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో పలువురు టిఆర్ఎస్ నాయకులు ఎంపీపీ లలిత వెంకన్న రాఘవ జయకర్ రావూరు శ్రీనివాస్ మార్కెడ్ యాడ్ చైర్మన్ నాగేశ్వరరావు భాస్కర్ రెడ్డి ఇందిరా హరీష్ వార్డు కౌన్సిలర్ ప్రజా ప్రతినిధులు పాల్గొన్నారు