కామ్రేడ్ మండవ. కృష్ణారావు ప్రధమ వర్ధంతి

Published: Tuesday July 26, 2022
మధిర రూరల్ జూలై 25 ప్రజా పాలన ప్రతినిధి మున్సిపాలిటీ పరిధిలో సోమవారం నాడు18 వ వార్డు లడకబజార్లో సోమవారం  సిపిఎం పార్టీ సీనియర్ నాయకులు, వ్యవసాయ కార్మిక సంఘం జిల్లా నాయకులు కామ్రేడ్. మండవ. కృష్ణారావు  ప్రథమ వర్ధంతి  నిర్వహించారు. ఈ వర్ధంతిలో పాల్గొని చిత్రపటానికి పూలమాల వేసి నివాళులర్పించిన ఐద్వా రాష్ట్ర ఉపాధ్యక్షురాలు బుగ్గవీటి.సరళ , మాజీ చైర్ పర్సన్ అప్రోజ్. సమీనా , ఐద్వా ఖమ్మం జిల్లా అధ్యక్షురాలు. బండి.పద్మ , ఐద్వా వైరా ఇంచార్జీ మేరుగు.రమణ , ఐద్వా వైరా పట్టణ కార్యదర్శి గుడిమెట్ల రజిత, ఐద్వా మధిర అధ్యక్షురాలు షేక్.ఫాతిమా, మరియు కుటుంబ సభ్యులు, సిపిఎం పార్టీ పట్టణ, మండల కమిటీ సభ్యులు, పార్టీ నాయకులు పాల్గొన్నారు.