రాష్ట్ర ప్రభుత్వం ఎన్నికల్లో ఇచ్చిన వాగ్దానాలు నెరవేర్చాలి

Published: Tuesday March 30, 2021
వలిగొండ, మార్చి 29, ప్రజాపాలన ప్రతినిధి : తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ప్రజలకు ఎన్నికల సందర్భముగా ఇచ్చిన వాగ్దానాలు నెరవేర్చాలని రాష్ట్ర వ్యవసాయ కార్మిక సంఘం రాష్ట్ర అధ్యక్షులు కలకొండ కాంతయ్య అన్నారు. సోమవారం మండల కేంద్రంలోని దేవిశ్రీ గార్డెన్లో నిర్వహించిన ముఖ్యకార్యకర్తల సమావేశంలో ఆయన మాట్లాడుతూ కేంద్ర ప్రభుత్వం వ్యవసాయ కార్మికుల పట్ల నిర్లక్ష్యంగా వ్యవహరిస్తుందని, దేశంలో జాతీయ ఉపాది హామీ పథకానికి 2 లక్షల కోట్లు కేటాయించి సంవత్సరానికి ప్రతి కుటుంబాన్ని 200 రోజుల పని కల్పించి రోజుకు 600 రూపాయల చొప్పున వేతనం ఇవ్వాలని డిమాండ్ చేశారు. రాష్ట్రంలో కెసిఆర్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చి 7 సంవత్సరాలు అయినప్పటికీ ప్రజలకు ఇచ్చిన హామీలు నెరవేర్చలేదని అన్ని హామీలు నెరవేర్చాలని డిమాండ్ చేశారు.ఈ కార్యక్రమంలో సిపిఐ జిల్లా కార్యదర్శి గోద శ్రీరాములు నాయకులు ఉప్పల ముత్యాలు, సలిగంజి వీరస్వామి, పోలేపాక యాదయ్య, వెంకటేశం, మహేష్, లింగస్వామి తదితరులు పాల్గొన్నారు.