ఆదిలోనే అంతమవుతున్న యాసంగి వరి నాట్లు

Published: Thursday January 19, 2023
శంకరపట్నం జనవరి 18 ప్రజాపాలన రిపోర్టర్:


శంకరపట్నం మండలంలోని అంబలపూర్, కేషవపట్నం గ్రామలలో తెగులు సోకిన వరి నాట్లను సిపిఐ జిల్లా కార్యవర్గ సభ్యుడు బోయిని అశోక్ ఆధ్వర్యంలో పంట పొలాలను క్షేత్రస్థాయిలో పరిశీలన చేశారు.
అనంతరం అయన మాట్లాడుతూ
యాసంగి పంటలు వేసినా ఆదిలోనే మోగిపురుగు
తెగులు సోకి వరినట్లు చాలా వరకు దెబ్బతింటున్నాయని, శంకరపట్నం మండలంలోని చాలా గ్రామాలలో వరి పొలాలు ఇదే రకంగా పురుగుసోకి దెబ్బతింటున్నాయని. రైతులు ఎన్ని రకాల మందులు కొట్టిన ఫలితం లేకుండా పోతుందని ఇప్పటికే చాలా ఎకరాలలో వరి పొలాలకు చాల నష్టం వాటిలిందన్నారు.
అలాగే మానకొండూరు నియోజకవర్గం వ్యాప్తంగా కూడా మోగి పురుగు తెగులు వల్ల భారీగానే వరి పొలాలకు నష్టం వాటిల్లుతుంది.ఇప్పటివరకు వ్యవసాయ అధికారులు ఈ విషయాన్ని పరిగణలోకి తీసుకోలేదు.కావున  అధికారులు తక్షణమే స్పందించి తెగులుకు గురైనటువంటి వరి నాట్లను పరిశీలించి వాటికి ఎలాంటి మందులు వాడితే నివారణ ఉంటుంది అనే దిశగా ప్రయత్నాలు చేసి రైతులకు వాటి నివారణకు పనిచేయు మందులను వాడమని సూచించాలని అయన కోరారు.
అలాగే నష్టపోయిన రైతులను వారి యొక్క వివరాలు సేకరించి వారికి ప్రభుత్వం ద్వారా ప్రత్యామ్నాయం కల్పించే విధంగా కృషి చేయాలని కోరుతున్నాము
నష్టపోతున్న వరినాట్ల పైన పూర్తిస్థాయి నివేదిక తయారుచేసి నష్టపోయిన రైతుల యొక్క వివరాలు రాష్ట్ర ప్రభుత్వానికి చేరే విధంగా ప్రయత్నాలు కొనసాగించి వారికి  నష్టపరిహారం అందే విధంగా చర్యలు చేపట్టాలని అయన అన్నారు. ఈ కార్యక్రమంలో సిపిఐ మండల కార్యదర్శి పిట్టల సమ్మయ్య, సిపిఐ మండల సహాయ కార్యదర్శి కన్నం సారయ్య, నాయకులు తాడవేణి రవి, పిట్టల తిరుపతి, శనిగరపు నరేష్, వివిధ గ్రామల రైతులు తదితరులు పాల్గొన్నారు.