సాకలి ఐలమ్మ విగ్రహాన్ని ప్రతిష్టించరా? కాంగ్రెస్ నాయకుల డిమాండ్

Published: Tuesday October 11, 2022
బెల్లంపల్లి అక్టోబర్ 10 ప్రజా పాలన ప్రతినిధి: తెలంగాణ వీరవనిత, తొలి దశ తెలంగాణ ఉద్యమకారిణి, చాకలి ఐలమ్మ విగ్రహాన్ని పాడైపోతున్న పట్టించుకునే నాధుడే లేడని బెల్లంపల్లి పట్టణ కాంగ్రెస్ నాయకులు మేకల శ్రీనివాస్, దాసరి ప్రతాప్, రామగిరి శ్రీనివాస్, మెరుగు రామకృష్ణ యాదవ్,లు ఒక ప్రకటనలో పట్టణంలోని అధికార పార్టీ నాయకులను ప్రశ్నించారు.
బెల్లంపల్లి ఏఎంసి  గ్రౌండ్  పార్క్ లో సాకలి ఐలమ్మ విగ్రహాన్ని ప్రతిష్టింప చేయడానికి తయారు చేసి అక్కడే వదిలిపెట్టారని, పట్టణ పాలకులు,నాయకులు దేశ, రాష్ట ,  వజ్రోత్సవ సంబరాలు విగ్రహం ముందే  జరుపుకున్నారు కానీ, ఎవరూ పట్టించుకోవడంలేదని,  విగ్రహం పూర్తిగా పాడై పోయినా పట్టించుకునే నాథుడే కరువయ్యారని, ఇది  చాలా బాధాకరమైన విషయమని అన్నారు. ఇప్పటికైనా అధికార పార్టీ నాయకులు సరైన స్థలంలో తెలంగాణ వీరవనిత చాకలి ఐలమ్మ విగ్రహాన్ని ప్రతిష్టింపజేయాలని వారు డిమాండ్ చేశారు.
 
 
 
Attachments area