సర్పన్ పల్లిలో డాక్టర్ బిఆర్ అంబబేడ్కర్ విగ్రహ ఆవిష్కరణ

Published: Monday April 10, 2023
* ముఖ్య అతిథిగా పాల్గొన్న బిసి కమిషన్ మెంబర్ శుభప్రద్ పటేల్
వికారాబాద్ బ్యూరో 09 ఏప్రిల్ ప్రజాపాలన : 
వికారాబాద్ మండల పరిధిలోని సర్పన్ పల్లి గ్రామంలో భారత రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బిఆర్ అంబేడ్కర్ విగ్రహ ఆవిష్కరణను రాష్ట్ర బిసి కమిషన్ మెంబర్ శుభప్రద్ పటేల్ ముఖ్య అతిథిగా పాల్గొని విగ్రహాన్ని ఆవిష్కరించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ ఆశయాలను ప్రతి ఒక్కరూ అనుసరించాలని, ఆయన చదువుకునేటప్పుడు ఎన్నో అవమానాలను ఎదుర్కొన్నాడని పేర్కొన్నారు. చదువు వలన
మనిషికి విలువ వస్తుందని అన్నారు. డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ రాసిన రాజ్యాంగం వలన ప్రతి ఒక్కరు ప్రస్తుతం సంతోషంగా జీవిస్తున్నారని స్పష్టం చేశారు. అంబేద్కర్ ఒక కులానికి చెందిన వ్యక్తి కాడని ఆయన అందరివాడు అని చెప్పారు. దేశంలోని ప్రతి ఒక్కరు ఆర్థిక సామాజిక రాజకీయపరంగా ఎదగాలని అసమానతలు లేని సమాజం నిర్మాణం కావాలని అన్నారు.ఈ కార్యక్రమంలో జిల్లా ఉత్సవ కమిటీ చైర్మన్ జగదీష్, ప్రధాన కార్యదర్శి నర్సింలు, కెవిపిఎస్ జిల్లా కార్యదర్శి మహిపాల్, మేధావుల ఫోరం అధ్యక్షులు దేవదాసు,మాజీ మున్సిపల్ వైస్ చైర్మన్ చిగుళ్ళపల్లి రమేష్, బిఆర్ఎస్ కేవి జిల్లా అధ్యక్షుడు భూమోల్ల కృష్ణ, ఉత్సవ కమిటీ మాజీ చైర్మన్ తిమ్మని శంకర్,ఎమ్ఎస్ పి జిల్లా కో ఆర్డినేటర్ పి.ఆనంద్,అంబెడ్కర్ గ్రామ కమిటీ అధ్యక్షుడు ఆనంద్,జిల్లా మహనీయుల కమిటీ అధ్యక్షుడు జగదీష్ తదితరులు ఉన్నారు.