మైనర్ బాలిక అత్యాచారం ఘటనపై కరీంనగర్ లో భగ్గుమన్న బీజేవైఎం ... సామాన్యులకు ఓ న్యాయం...? బడాబాబు

Published: Tuesday June 07, 2022
మైనర్ బాలిక అత్యాచార ఘటన కేసును సీబీఐ చే విచారణ జరిపించాలి
 
 బీజేపీ నేతలు తాళ్లపల్లి శ్రీనివాస్ గౌడ్,  దురిశెట్టి సంపత్ డిమాండ్..
కరీంనగర్ జూన్ 6 ప్రజాపాలన ప్రతినిధి :
 జూబ్లీహిల్స్ మైనర్ బాలికపై అత్యాచార ఘటన  పై  కరీంనగర్లో బీజేవైఎం శాఖ భగ్గుమంది. బాలికపై అత్యాచార ఘటన పై రాష్ట్ర ప్రభుత్వ  నిర్లక్ష్య వైఖరిని నిరసిస్తూ భారతీయ జనతా యువమోర్చా జిల్లా శాఖ కరీంనగర్లో  రాస్తారోకో చేపట్టి నిరసన వ్యక్తం చేసింది.  ఈ కార్యక్రమంలో పాల్గొన్న బిజెపి జిల్లా ప్రధాన కార్యదర్శి తాళ్లపల్లి శ్రీనివాస్ గౌడ్,  బీజేవైఎం రాష్ట్ర ఉపాధ్యక్షుడు  దురిశెట్టి  సంపత్ లు మాట్లాడుతూ జూబ్లీహిల్స్ బాలిక అత్యాచారం ఘటనపై  సి బి ఐ   తో ఎంక్వయిరీ జరిపించాలని డిమాండ్ చేశారు.    రాష్ట్రంలో లో మహిళలు , యువతులు, మైనర్ బాలికలపై వరుసగా జరుగుతున్న అఘాయిత్యాల లో సామాన్యులకు ఓ న్యాయం, బడాబాబులకు ఓ న్యాయం అనే విధంగా కెసిఆర్ ప్రభుత్వం వ్యవహరిస్తూ, ఆ విధంగానే నిందితులపై చర్యలు తీసుకుంటుందని మండిపడ్డారు . ఇటీవల జూబ్లీహిల్స్ లో మైనర్ బాలికపై జరిగిన అత్యాచారం ఘటన తో ప్రమేయం ఉన్నా టిఆర్ఎస్ , ఎంఐఎం నాయకుల కు  చెందిన వారి కొడుకులను   టిఆర్ఎస్ ప్రభుత్వం కాపాడే ప్రయత్నం   చేస్తుందని ,  అలాగే  పోలీసులు   కేసును తప్పుదారి పట్టిస్తు,నీరుగార్చే వ్యవహరించడం దారుణమన్నారు.  తెలంగాణ రాష్ట్రంలో మహిళలు యువతు లకు భద్రత లేకుండా పోయిందని , మైనర్ బాలిక పట్ల  జరిగిన అత్యాచార ఘటన  టిఆర్ఎస్ ప్రభుత్వ పాలనకు అద్దం పడుతోందన్నారు. కేసీఆర్ మైనార్టీ సంతుష్టరాజకీయా అవసరాలను  దృష్టిలో ఉంచుకొని ఎంఐఎంకు చెందిన   కొందరి  వ్యక్తులను కాపాడడానికి టిఆర్ఎస్   ప్రభుత్వం ప్రయత్నిస్తుందని వారు ఆరోపించారు. కెసిఆర్ ప్రభుత్వానికి  మైనర్ బాలిక అత్యాచార ఘటనపై చిత్తశుద్ధి ఉంటే  వెంటనే బాధ్యులపై కఠిన చర్యలు చేపట్టాలని, లేకపోతే సీబీఐతో ఎంక్వయిరీ చేయించాలని ఈ సందర్భంగా వారు డిమాండ్ చేశారు,ఈ కార్యక్రమంలో బీజేవైఎం రాష్ట్ర అధికార ప్రతినిధి బండారి గాయత్రి గారు, బీజేవైఎం రాష్ట్ర కార్యవర్గ సభ్యులు మునిగంటి కుమార్ గారు, రాష్ట్ర సోషల్ మీడియా కన్వీనర్ కొండ బత్తిని సతీష్ ,బీజేవైఎం జిల్లా ప్రధాన కార్యదర్శి ఎడవల్లి శశిధర్ రెడ్డి, ఉపాధ్యక్షులు ఈసారి జశ్వంత్, గుండారపు సంపత్, శ్రీరాముల శ్రీకాంత్, కరీంనగర్ పార్లమెంట్ సోషల్ మీడియా కన్వీనర్ ఉప్పరపెల్లి శ్రీనివాస్ ,బిజెపి జోన్ అధ్యక్షులు పాదం శివరాజ్ ,జిల్లా కార్యవర్గ సభ్యులు అజయ్, శివ, కరీంనగర్ జోన్ అధ్యక్షులు పొనల రాము, రురల్ మండల అధ్యక్షులు రమేష్,నాయకులు ఆకుల మనోహర్,కల్యాణ్ లు పాల్గొన్నారు..