ఆదివాసి, గిరిజన, పేద ప్రజల అక్రమ అరెస్టులకు నిరసనగా

Published: Wednesday June 08, 2022
 తాండూరు లో  జాతీయ రహదారిపై సిపిఎం పార్టీ నాయకుల ధర్నా
 
బెల్లంపల్లి జూన్ 7 ప్రజా పాలన ప్రతినిధి: మంచిర్యాల జిల్లాలోని ఆదివాసి, గిరిజన, పేద ప్రజలను అటవీశాఖ అధికారులు చేసిన అక్రమ అరెస్టులకు వ్యతిరేకంగా మంచిర్యాల జిల్లా తాండూర్ మండల కేంద్రంలోని  ఐ బి, చౌరస్తాలో జాతీయ రహదారిపై సిపిఎం పార్టీ నాయకులు మంగళవారం  ధర్నా నిర్వహించారు.
ఈ సందర్భంగా నాయకులు మాట్లాడుతూ,
మంచిర్యాల జిల్లా దండేపల్లి మండలం మాకుల పేట పరిధిలోని పోచం గూడలోనీ ఆదివాసీ, గిరిజన, పేదలు అటవీ హక్కుల చట్టం ప్రకారం 2005 కంటే ముందు నుంచి పోడు భూములను సాగు చేసుకుంటున్నారనీ,
సాగు చేసుకుంటున్న  పన్నెండు మంది మహిళలను ఫారెస్టు అధికారులు అక్రమంగా జైల్లో పెట్టారనీ అన్నారు,
ప్రభుత్వాలు ఒకవైపు పోడు భూములకు పట్టాలు ఇస్తామని అంటూ, మరోవైపు ఫారెస్ట్ అధికారులతో ఆదివాసీ గిరిజనులను అక్రమంగా అరెస్టు చేసి జైల్లో పెడుతున్నారనీ,
 జైల్లో పెట్టిన పన్నెండు మంది మహిళలను వెంటనే విడుదల చేయాలని వారు డిమాండ్ చేశారు.
 ఆదివాసి గిరిజనులకు, మరియు పేదలకు అడవి హక్కులచట్టం, ప్రకారం పోడు భూములకు పట్టాలు ఇచ్చి కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు ఆదుకోవాలని విజ్ఞప్తి చేశారు.
ఆదివాసి గిరిజనుల కోసం ఆటవి  హక్కుల చట్టం ఉన్నప్పటికీ,  ఆదివాసీ గిరిజనులను, పేదలను, ఏమాత్రం పట్టించుకోవడం లేదనీ,  రాష్ట్ర, కేంద్ర, ప్రభుత్వాలు వెంటనే జోక్యం చేసుకొని పోడు భూముల పై గిరిజన, ఆదివాసులకు, చట్ట ప్రకారం హక్కులు కల్పించాలని వారన్నారు.
గతంలో భూమికోసం దొరల తోనే పోరాడి సాధించు కున్నామని,
నేడు అదే భూమి కోసం కేంద్ర ,రాష్ట్ర ప్రభుత్వాలను గద్దెదించైనా  భూములను సాధించుకుంటామని  అన్నారు.
2006లో పార్లమెంట్ లో అయినటువంటి అటవి హక్కుల చట్టాన్ని అమలు చేసి, ఆదివాసీ గిరిజనులను మరియు పేదలను ఆదుకోవాలని కేంద్ర ,రాష్ట్ర ప్రభుత్వాలకు విజ్ఞప్తి చేశారు.
లేనిపక్షంలో ఆదివాసి గిరిజనుల, పేదల పోడు భూముల సమస్యలపై సిపిఎం  పార్టీ పోరాటాలను ఉధృతం చేస్తుందనీ హెచ్చరించారు.
ఈ కార్యక్రమంలో తాండూరు మండల పార్టి నాయకులు దాగం రాజారాం,
వేల్పుల శంకర్, బొల్లం రాజేశం, 
చంద్రయ్య, రాములు , బాపు, తిరుపతి , తదితరులు పాల్గొన్నారు