ప్రజాస్వామ్య మనుగడకు ఓటు వజ్రాయుధం

Published: Monday March 15, 2021

ఓటు హక్కు వినియోగించుకున్న ఎమ్మెల్యే డాక్టర్ ఆనంద్ విద్యా మౌలిక వసతుల కల్పనల సంస్థ అధ్యక్షుడు నాగేందర్ గౌడ్

వికారాబాద్ జిల్లా, ప్రతినిధి మార్చి 14 ( ప్రజాపాలన ) : ప్రజాస్వామ్యం పరిఢవిల్లాలంటే ప్రతి పట్టభద్రుడు తమ ఓటు హక్కును వినియోగించుకుని తనకు నచ్చిన వ్యక్తికి ఓటు వేయాలని వికారాబాద్ ఎమ్మెల్యే డాక్టర్ మెతుకు ఆనంద్ విద్యా మౌలిక వసతుల కల్పనల సంస్థ అధ్యక్షుడు నాగేందర్ గౌడ్ విజ్ఞప్తి చేశారు. ఆదివారం జిల్లా కేంద్రంలోని వికారాబాద్ బాలుర ఉన్నత పాఠశాలలో తమ ఓటు హక్కును వినియోగించుకున్నారు. ఈ సందర్భంగా వారు సంయుక్తంగా మాట్లాడుతూ మూడు జిల్లాలలో ప్రప్రథమంగా తమ ఓటు హక్కును వినియోగించుకున్నారు. ప్రతి పట్టభద్రుడు బాధ్యతాయుతంగా ఓటు వేయడానికి  ముందుకు రావడం అభినందనీయమని కొనియాడారు. సమస్యల పరిష్కారానికి మన ఓటు ఎంతో విలువైనది అని గుర్తు చేశారు. టిఆర్ఎస్ పార్టీ బలపర్చిన అభ్యర్థి సురభి వాణి దేవి భారీ మెజారిటీతో గెలుపొందనున్నదని ఆశాభావం వ్యక్తం చేశారు. సీఎం కేసీఆర్ ప్రవేశపెట్టిన సంక్షేమ పథకాలే గెలుపుకు పునాదిరాళ్లుగా నిలుస్తాయని పేర్కొన్నారు అధికార పార్టీ అభ్యర్థికి ఓటు వేసి గెలిపిస్తే సమస్యల పరిష్కారానికి ప్రత్యేకంగా నిధులు కేటాయించి అభివృద్ధి చేస్తారని చెప్పారు