ఎమ్మార్పీఎస్ నిరసన దీక్షకు సంఘీభావం తెలిపిన తెలుగుదేశం పార్టీ

Published: Monday August 01, 2022
బోనకల్, జులై 31 ప్రజా పాలన ప్రతినిధి : ఎస్సీ వర్గీకరణకు పార్లమెంటు సమావేశాల్లో చట్టబద్ధత కల్పించాలని గత కొన్ని రోజులుగా మండల కేంద్రంలోని తహసిల్దార్ కార్యాలయం ముందు ఎమ్మార్పీఎస్ నాయకులు చేస్తున్న నిరసన దీక్షకు శనివారం బోనకల్ మండల తెలుగుదేశం పార్టీ సంఘీభావం తెలిపారు. ఈ సందర్భంగా తెలుగుదేశం మండలాధ్యక్షుడు రావుట్ల సత్యనారాయణ మాట్లాడుతూ తెలుగుదేశం పార్టీ అధికారంలో ఉన్న రోజుల్లో ఎస్సీ వర్గీకరణ చేయాలని ఆనాటి ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు తీర్మానం చేయటం జరిగిందని, కానీ తదనంతరం అధికారంలోకి వచ్చిన పార్టీలు ఎస్సీలను ఓటు బ్యాంకులుగానే వాడుకున్నారు తప్ప వర్గీకరణకు చట్టబద్ధత కల్పించలేదని, అన్నారు. కేంద్రంలో అధికారంలో ఉన్న బిజెపి, వర్షాకాల పార్లమెంటు సమావేశాలలో వర్గీకరణ బిల్లుకు వెంటనే చట్టబద్ధత కల్పించాలని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో తెలుగుదేశం పార్టీ రైతు పార్లమెంటరీ అధ్యక్షుడు నందమూరి సత్యనారాయణ, టిఎన్ఎస్ఎఫ్ మండల అధ్యక్షుడు బంధం అనిల్ కుమార్, తదితరులు పాల్గొన్నారు.