జిల్లా అదనపు కలెక్టర్ వరుణ్ రెడ్డి బదిలీ **

Published: Tuesday June 14, 2022
నూతన అదనపు కలెక్టర్ గా "చాహట్ బాజ్ పాయి" **
 
ఆసిఫాబాద్ జిల్లా జూన్ 13 (ప్రజాపాలన, ప్రతినిధి) : జిల్లా కు గత సంవత్సరం 27న వరుణ్ రెడ్డి జిల్లా అదనపు కలెక్టర్( స్థానిక సంస్థలు)గా బాధ్యతలు స్వీకరించారు. 11 నెలల వ్యవధిలోనే జిల్లా అభివృద్ధిపై తనదైన ముద్ర వేశారు. పోషణ అభియాన్ పథకం అమలులో దేశం లోనే జిల్లాను ఉత్తమంగా నిలిపి ప్రధానమంత్రి చేతుల మీదుగా అవార్డ్ అందుకోవడంలో వరుణ్ రెడ్డి పాత్ర కీలకమని జిల్లా కలెక్టర్ రాహుల్ రాజ్ పలు సందర్భాలలో వెల్లడించారు. జిల్లాను ప్రత్యేక శ్రద్ధ తీసుకుని పనులు పూర్తి చేసి బదిలీ అయ్యారు.
 
జిల్లాకు నూతన అదనపు కలెక్టర్ గా వరుణ్ రెడ్డి సతీమణి "చాహట్ బాజ్ పాయి" సోమవారం బాధ్యతలు స్వీకరించారు. ఈ సందర్భంగా జిల్లా కేంద్రంలోని కలెక్టరేట్ భవనం లో జిల్లా కలెక్టర్ రాహుల్ రాజ్ ను మర్యాదపూర్వకంగా కలిసి పుష్పగుచ్చం అందజేశారు. "చాహట్ బాజ్ పాయి" 2019 ఐఏఎస్ బ్యాచ్ కు చెందినవారు. ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్ర పశ్చిమ గోదావరి జిల్లా సహాయ కలెక్టర్ గా మొదటి పోస్టింగ్ అనంతరం పదోన్నతి పై నంద్యాల సబ్ కలెక్టర్ గా విధులు నిర్వహించారు