కస్తూర్బా గాంధీ బాలికల సిబ్బందిని రెగ్యులరైజ్ చేయాలి

Published: Tuesday October 18, 2022
ఎన్టిడబ్ల్యూఏ  రాష్ట్ర ప్రధాన కార్యదర్శి వై గీత 
వికారాబాద్ బ్యూరో 17 అక్టోబర్ ప్రజా పాలన : కస్తూర్బా గాంధీ బాలికల విద్యాలయంలో పని చేస్తున్న సిబ్బందిని రెగ్యులరైజ్ చేయాలి అని ప్రగతిశీల కస్తూర్బా గాంధీ బాలికల విద్యాలయాల నాన్ టీచింగ్ వర్కర్స్ అసోసియేషన్  రాష్ట్ర ప్రధాన కార్యదర్శి వై గీత డిమాండ్ చేశారు
ఈ సందర్భంగా వై గీత మాట్లాడుతూ ఒడిస్సా సీఎం నవీన్ పట్నాయక్ 57,000 మంది కాంట్రాక్టు కార్మికులను రెగ్యులరైజ్ చేస్తూ గొప్ప నిర్ణయం తీసుకోవడం జరిగింది అదేవిధంగా తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర్ కూడా కాంట్రాక్ట్ అవుట్సోర్సింగ్ రంగాల్లో పనిచేస్తున్నటువంటి కార్మికులందరికీ రెగ్యులరైజ్ చేసి కార్మిక వర్గాన్ని ఆదుకోవాలని అన్నారు కేజీబీవీ హాస్టల్లో వారాంతపు సెలవులకు నోచుకోక 12 గంటలు పనిచేస్తూ పని ఒత్తిడికి గురవుతు సేవలందిస్తున్న నాన్ టీచింగ్ వర్కర్లకు శ్రమకు తగ్గ వేతనం చెల్లించి ఈఎస్ఐపిఎఫ్ సౌకర్యం కల్పించాలని ఐఎఫ్టియు కేజీబీవీ నాట్ టీచింగ్ వర్కర్స్ అసోసియేషన్ ప్రభుత్వాన్ని డిమాండ్ చేయడం జరిగింది. ఈ కార్యక్రమంలో సిబ్బంది బాలమణి' నీలమ్మ' ఈశ్వరమ్మ 'పుణ్యమా' వెంకటమ్మ 'స్వప్న పాల్గొన్నారు.