పద్మశాలి సంఘం క్యాలెండర్ ఆవిష్కరణ

Published: Wednesday January 04, 2023
పట్లూరు గ్రామ సర్పంచ్ దేవరదేశి ఇందిర అశోక్
వికారాబాద్ బ్యూరో 03 జనవరి ప్రజా పాలన : వికారాబాద్ నియోజకవర్గం పద్మశాలి సంఘము 2023 క్యాలండర్ ను ఆవిష్కరించామని పట్లూరు గ్రామ సర్పంచ్ దేవరదేశి ఇందిర అశోక్ మంగళవారం ఒక ప్రకటనలో తెలిపారు. గ్రామ సర్పంచ్ నివాసం ముందు భాగంలో పద్మశాలి సంఘం 2023 క్యాలెండర్ ను గ్రామ సర్పంచ్, పద్మశాలి సంఘం సభ్యుల ఆధ్వర్యంలో ఆవిష్కరించారు. ఈ సందర్భంగా పట్లూరు గ్రామ సర్పంచ్ దేవరదేశి ఇందిర అశోక్ మాట్లాడుతూ చేనేత కార్మికుల బతుకులపై జిఎస్టి పెను భారం అయ్యిందని ఆవేదన వ్యక్తం చేశారు. కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు మానవతా దృక్పథంతో పేదరికాన్ని అనుభవిస్తున్న చేనేత కార్మికులను ఆదుకొనుటకు జీఎస్టీ ని తగ్గించాలని కోరారు. రాష్ట్ర ప్రభుత్వం చేనేత కార్మికుల ఆర్థిక పరిస్థితిని గట్టెక్కించేందుకు బతుకమ్మ చీరలు క్రిస్మస్, రంజాన్ కానుకలుగా ఆదుకుంటుందని స్పష్టం చేశారు. చేనేత కార్మికులు నాణ్యమైన సరసమైన మన్నికైన వస్త్రాలను చేతి ద్వారా తయారు చేస్తున్నారని గుర్తు చేశారు. చేనేత రంగంలో యంత్రాలు రావడంతో చేనేత కార్మికుల బతుకులు బండలుగా మారాయని ఆవేదన వ్యక్తం చేశారు. ఈ కార్యక్రమంలో పట్లూరు పద్మశాలి సంఘ సభ్యులు ముఖ్య అతిథిగా వికారాబాద్ అధ్యక్షులు వర్కల మల్లేశం ప్రధాన కార్యదర్శి ఆంజనేయులు, దేవరదేశి దశరథ్, కోట పాండురంగం, దేవరదేశి ప్రకాష్, న్యాలం కుమార్, సులోచన లక్ష్మమ్మ వినోద సంధ్య భాగ్యలక్ష్మి సునీత తదితర పద్మశాలి సంఘం సభ్యులు పాల్గొన్నారు.