అంగన్ వాడి కేంద్రంలో వైద్య ఆరోగ్య శిబిరం

Published: Wednesday May 18, 2022

మంచిర్యాల టౌన్, మే 17, ప్రజాపాలన : మంచిర్యాల జిల్లా వైద్యారోగ్య శాఖ ఆధ్వర్యంలో రాష్ట్రీయ బాల స్వాస్థ్య కార్యక్రమంలో భాగంగా మంగళవారం రోజున  జిల్లా కేంద్రంలోని ఎ సి సి - 3 అంగన్ వాడి కేంద్రంలో వైద్య ఆరోగ్య శిబిరం నిర్వహించారు. ఈ శిబిరంలో మెడికల్ ఆఫీసర్ డాక్టర్ రాము పాల్గొని అంగన్ వాడి కేంద్రంలోని పిల్లలు, తల్లులకు వివిధ రకాల వైద్య పరీక్షలు నిర్వహించారు. పిల్లల్లో తలెత్తే ఎనిమియా, పుట్టుకతో వచ్చే వ్యాధులు, ఎండాకాలంలో ఎదురయ్యే చర్మ సంబంధిత వ్యాధులకు సంబంధించి ఆరోగ్య పరీక్షలు చేశారు. అనంతరం డాక్టర్ రాము మాట్లాడుతూ పిల్లల ఆరోగ్యం పట్ల తల్లిదండ్రులు ప్రత్యేక శ్రద్ధ చూపాలని సూచించారు. పిల్లల్లో ఎలాంటి ఆరోగ్య సమస్యలు తలెత్తినా వెంటనే వైద్య పరీక్షలు చేయించి తగిన జాగ్రత్తలు తీసుకోవాలన్నారు. గర్భిణీలు పోషక విలువలతో కూడిన ఆహారం తీసుకోవడం వల్ల ఆరోగ్యవంతులైన శిశువులు జన్మిస్తారని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో అంగన్ వాడి టీచర్ ఎన్. పద్మ, సిబ్బంది, తదితరులు పాల్గొన్నారు.