ఈ నెల 27న నిధి ఆప్కే నికత్-2.0 అవగాహన శిబిరం. ప్రాంతీయ పి.ఎఫ్. కమీషనర్-2 & ఓ.ఐ.సి. సెల్వత్కర్ థానయ్య

Published: Wednesday January 25, 2023
మంచిర్యాల బ్యూరో, జనవరి 24, ప్రజాపాలన :
 
ఉమ్మడి ఆదిలాబాద్, కరీంనగర్ జిల్లాల పరిధిలోని అన్ని జిల్లాలలో ఈ నెల 27వ తేదీ ఉదయం 9 గం.ల నుండి సాయంత్రం 5.45 గంటల వరకు ఉద్యోగుల భవిష్యనిధి సంస్థ, ప్రాంతీయ కార్యాలయం-కరీంనగర్ ఆధ్వర్యంలో నిధి ఆప్కే నికత్-2.0 (పి.ఎఫ్. మీ ముంగిట) జిల్లా అవగాహన శిబిరం, ఔట్రీచ్ ప్రోగ్రాము నిర్వహించడం జరుగుతుందని ప్రాంతీయ పి.ఎఫ్. కమీషనర్-2 , ఓ.ఐ.సి. సెల్వత్కర్ థానయ్య మంగళవారం ఒక ప్రకటనలో తెలిపారు. కరీంనగర్ జిల్లాలోని జిల్లా కలెక్టరేట్ ఆడిటోరియం, పెద్దపల్లి జిల్లాలో ఎన్.టి.పి.సి.లోని ఎంప్లాయిస్ డెవలప్మెంట్ సెంటర్ మిలీనియం హాల్, రాజన్న సిరిసిల్ల జిల్లాలో సిరిసిల్ల మున్సిపల్ కౌన్సిల్ సమావేశ మందిరం, జగిత్యాల జిల్లాలో జగిత్యాల మున్సిపల్ కౌన్సిల్ సమావేశ మందిరంలో కొమురంభీం ఆసిఫాబాద్ జిల్లాలో ఆసిఫాబాద్ లోని ఎల్లాగౌడ్ ట పద్మశాలి భవన్, మంచిర్యాల జిల్లాలో మంచిర్యాల పట్టణంలోని సురభి హోటల్, నిర్మల్ జిల్లాలో నిర్మల్ లోని మయూరి హోటల్ మినీ ఫంక్షన్ హాల్లలో ఒకేసారి అవగాహన శిబిరాలు నిర్వహించడం జరుగుతుందని తెలిపారు. సభ్యులు, ట్రేడ్ యూనియన్లు, యజమానుల సంఘాలు తమ సమస్యలను పరిష్కరించుకునేందుకు ఈ శిబిరానికి హాజరు కావాలని తెలిపారు.