దళితులపై జరిగిన దాడులను మొత్తంగా పరిగణలోకీ తీసుకొని దాడులు చేసిన వారిపై

Published: Tuesday January 10, 2023

కేసు నమోదు చేయాలి ప్రజాపాలనాకొడంగల్ ప్రతినిధి09: వికారాబాద్ జిల్లా కలెక్టర్ గారికి కొడంగల్ తహసిల్దార్ గారి ద్వారా దళిత ప్రజా సంఘాల ఆధ్వర్యంలో ఈరోజు దళిత ప్రజా సంఘాల పార్టీల ఆధ్వర్యంలో కొడంగల్ తహసిల్దార్ గారి ద్వారా ప్రభుత్వానికి విజ్ఞాపన లేఖను పంపడం జరిగింది. ఈ లేఖలో కొడంగల్ రావులపల్లి అంబేద్కర్ విగ్రహ సభ సందర్భంగా జరిగిన వివిధ సమూహాల ఆందోళనల ఫలితంగా రాష్ట్రంలోని వివిధ గ్రామాలలో దళితులపై బిజెపి దాని అనుబంధ సంఘాలకు సంబంధించిన వారు దాడులను కొనసాగించారు. ఈ దాడులు ముఖ్యంగా చైతన్యవంతమవుతున్న దళితులను అణచడానికి, రాబోయే ఎన్నికల్లో రాజకీయాల్లో పొందడానికి సంబంధించిన ఎత్తుగడలలో భాగంగానే అయ్యప్ప భక్తుల చాటున ఈ దాడులు చేశారని దళిత ప్రజా సంఘాలు ఆరోపించాయి. నారాయణపేట జిల్లాలో వికారాబాద్ జిల్లాలో దళితులపై జరిగిన దాడులను మొత్తంగా పరిగణలోకీ తీసుకొని దాడులు చేసిన వారిపై కేసు నమోదు చేయాలని చట్టపరమైన చర్యలు తీసుకోవాలని వారు లేఖలో ప్రభుత్వాన్ని కోరారు. తెలంగాణలో కొనసాగుతున్న వైశ్యమ్యాలను నిలువరింప చేయడానికి మరియు భౌతిక వాదులకు ప్రజాస్వామ్య వాదులకు దళితులకు రక్షణ కల్పించాలని ఆ లేఖలో పొందుపరిచారు. ఈ కార్యక్రమంలో కొత్తూరు చంద్రయ్య ఎస్సీ, ఎస్టి,బీసీ మైనార్టీ హక్కుల పోరాట సమితి జిల్లా అధ్యక్షులు, u. రమేష్ బాబు అంబేద్కర్ సంగం తాలూకా అధ్యక్షులు గారు, ఎరన్ పల్లి శ్రీనివాస్ తెలంగాణ ఉద్యమకారుల ఐక్యవేదిక జిల్లా అధ్యక్షులు, సూర్య నాయక్ ఎల్ హెచ్ పి ఎస్ జిల్లా అధ్యక్షులు, లక్ష్మప్ప జిల్లా నాయకులు, అంజలయ్య కేఎన్పిఎస్ మండల అధ్యక్షుడు,స్వేరో తాలూకా అధ్యక్షులు సాయిలు, వెంకట్ గార్లు, ఎస్సీ ఎస్టీ మానిటరింగ్ కమిటీ నాయకులు దస్తప్ప గారు, చిన్ని కృష్ణ జిల్లా నాయకులు, కరాటే వెంకటయ్య, కాశీనాథ్, నియోజకవర్గ మండల, గ్రామాల నాయకులు తదితరులు ఈ కార్యక్రమంలో 50 మందికి పైగా ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు.