తహశీల్దార్ కార్యాలయం ఎదుట విఆర్ఎ ల ధర్నా

Published: Tuesday February 08, 2022
ఇబ్రహీంపట్నం ఫిబ్రవరి 7 ప్రజాపాలన ప్రతినిధి : ఈ కార్యక్రమానికి సిఐటియు రంగారెడ్డి జిల్లా కార్యదర్శి చంద్రం మోహన్. సిఐటియు రంగారెడ్డి జిల్లా ఉపాధ్యక్షుడు పెండ్యాల బ్రహ్మయ్య లు మద్దతు తెలిపి మాట్లాడారు. అంసేబ్లీలో తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్ ప్రకటించిన పే-స్కేల్ జీఓ ను వెంటనే విడుదల చేయాలని. చనిపోయిన విఆర్ఎ ల వారసులకు  ఉద్యోగాలు ఇవ్వాలని. అరుహులైన వారికి పదోన్నతులు కల్పించాలని. పెండింగ్ జీతాలు చెల్లించాలని. కనీస వేతనం అమలు చేయాలని. వేతనం పైన 30%శాతం పెంచి నేటికీ 18నేలలు పిఆర్ సీ జివో ఇవ్వాలని తక్కువ వేతనాలతో బ్రతుకులు వెళ్ళదిస్తున్నారని. పెరిగిన ధరలకు అనుగుణంగా అమలుచేయడం లెదనీ మాండీ పడ్డారు.. విఆర్ఎ లందరికీ. డబుల్ బెడ్ రూం ఇండ్లు ఇవ్వాలని. కరోనా లో చనిపోయిన విఆర్ఎ లకు 50లక్షలు ఎక్స్ గ్రేషియ ఇవ్వాలని. ఈ నేల 10న చలో కలెక్టరేట్ జయప్రదం చేయాలని. తహశీల్దార్ మహమూద్ అలీ గారికి డిమాండ్లతో కూడిన వినతిపత్రాన్ని అందజేశారు. ఈ కార్యక్రమంలో విఆర్ఎ లు జంగయ్య, వెంకటయ్య, శ్రీనివాస్, నవీన్, శంకర్.. రాజు. కృష్ణ య్య.చంద్రయ్య. నాగరాజు. బుగరాములు. స్వామి. తదితరులు పాల్గొన్నారు.