పాలసేకరణ కేంద్ర ఎన్నికల్లో తెరాస మద్దతు దారుల ఆధిక్యం

Published: Tuesday June 29, 2021
పరిగి, జూన్ 28, ప్రజాపాలన ప్రతినిధి : వికారాబాద్ జిల్లా దోమ మండల కేంద్రంలో కేంద్రపాలఉత్పత్తి దారుల సహకార సంఘం ఎన్నికల్లో తెరాస పార్టీ మద్దతు దారులు ఆధిక్యం చాటారు. కేంద్రంలో 196. పాలు విక్రయించే రైతులకు ఓటు హక్కు ఉండగా ఒక్కరు రెండు ఓట్లు వేసే పద్దతిలో సోమవారం జరిగిన ఎన్నికల్లో తెరాస మద్దతుదారులు గొల్ల అంజిలమ్మ. పుట్టి అనిత.కాంగ్రెస్ పార్టీ మద్దతు దారులు ఎన్.సత్యమ్మ. ఒడ్డె యాదమ్మలు పోటీ చేయగా తెరాస మద్దతు దారు గొల్ల అంజిలమ్మకు 115 ఓట్లు పోలవడంతో ఆమెను మొదటి విజేతగా ప్రకటించారు. పుట్టి అనిత. ఎన్ సత్యమ్మకు సమానంగా 89. ఓట్లు రాగా ఒడ్డె యాదమ్మకు 70.ఓట్లు వొచ్చాయి దింతో సమానంగా పోలైన పుట్టి అనిత.ఎన్ సత్యమ్మలను ఇరు పార్టీల నాయకుల నిర్ణయం తో ఎన్నికల అధికారి గురునాథ్ రెడ్డి ""టాస్'''కు ఒప్పించడం తో టాస్ లో కాంగ్రెస్ పార్టీ మద్దతు దారు సత్యమ్మను వరించడం తో సత్యమ్మను రెండో డైరెక్టర్ గా ఎన్నికల అధికారి ప్రకటించారు. రైతులు కెసిఆర్ పనితీరుపై నమ్మకంతో ఉన్నారన డానికి ఎన్నికల్లో ఓట్ల పోలే నిదర్శనమని దోమ సర్పంచ్ కె రాజిరెడ్డి అన్నారు ఈ కార్యక్రమంలో పాల సంఘం ఛైర్మెన్ యాదయ్య డైరెక్టర్ లు రైతు కో ఆర్డినేటర్ లక్ష్మయ్య ఉప సర్పంచ్ గోపాల్ గ్రంతాలయ డైరెక్టర్ బంగ్లా యాదయ్య గౌడ్ కో ఆప్షన్ సభ్యులు ఖాజా పాషా వార్డ్ సభ్యులు లక్ష్మణ్.మైను నరేందర్ రెడ్డి. గౌస్ తెరాస డైరెక్టర్ లు నాయకులు రవీందర్ రెడ్డి గొల్ల శ్రీను మహమ్మద్ గౌస్ నారాయణ తదితరులు పాల్గొన్నారు.