మిడ్ డే మిల్ వర్కర్స్ జాతి మహాసభలను జయప్రదం చేయండి

Published: Saturday October 29, 2022

బోనకల్, అక్టోబర్ 29 ప్రజా పాలన ప్రతినిధి: నవంబర్ 4, 5 తారీకులలో హైదరాబాదులో జరిగే మిడ్ డే మీల్స్ జాతీయ మహాసభలను జయప్రదం చేయాలని యూనియన్ రాష్ట్ర కార్యదర్శి ఎస్ వి రమ పిలుపునిచ్చారు. శుక్రవారం బోనకల్ సిఐటియు కార్యాలయంలో కుశలమ్మ అధ్యక్షతన సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఎస్ వి రమ మాట్లాడుతూ రాష్ట్ర వ్యాప్తంగా సుమారు 54,201 మంది 25 వేల పాఠశాలలో 24 లక్షల మంది విద్యార్థులకు మధ్యాహ్న భోజనం పథకం కార్మికులు భోజనం వండి పెడుతున్నారు. పెరిగిన ధరలతో పోలిస్తే కేటాయించిన బడ్జెట్ సరిపోవట్లేదని, ధరల పెరుగుదలతో కార్మికులు తీవ్ర ఆర్థిక ఇబ్బందులు పడుతున్నారని, ఈ మహాసభల్లో వారి సమస్యలపై చర్చించి భవిష్యత్తు ఉద్యమాలకు పిలుపునిస్తామని అన్నారు. ఈ కార్యక్రమంలో సిఐటియు జిల్లా అధ్యక్షులు తుమ్మ విష్ణువర్ధన్, కళ్యాణపు వెంకటేశ్వర్లు ,జిల్లా నాయకులు రమ్య, సిఐటియు మండల కన్వీనర్ బోయినపల్లి వీరబాబు, నాయకులు గుగులోత్ నరేష్, ఎం రామనరసమ్మ ,నాగమణి, సాగర్ లక్ష్మి, మోర్ల అనసూయ తదితరులు పాల్గొన్నారు.