దామగుండం అటవీ ప్రాంతాన్ని సంరక్షించాలి

Published: Tuesday March 09, 2021
మహిళా సంఘం అధ్యక్షురాలు రత్నమ్మ
వికారాబాద్ జిల్లా, మార్చి 8 ( ప్రజాపాలన ప్రతినిధి ) : దామగుండం అటవీ ప్రాంతాన్ని సంరక్షించాలని మహిళా సంఘం అధ్యక్షురాలు రత్నమ్మ డిమాండ్ చేశారు. సోమవారం జిల్లా కేంద్రంలోని అటవీ ప్రాంతం కార్యాలయంలో పూడూరు గ్రామ ప్రజలు అంతర్జాతీయ మహిళా దినోత్సవాన్ని పురస్కరించుకొని దామగుండం అటవీ ప్రాంతాన్ని రక్షించాలని ధర్నా నిర్వహించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ.. దామగుండం వన్యప్రాణులకు ఆవాస కేంద్రంగా ఉందని పేర్కొన్నారు. 157 రకాల పక్షి జాతులు నివసిస్తున్నాయని తెలిపారు.  పూడూరు గ్రామ ప్రజలు అటవీ ప్రాంతమే  జీవనాధారంగా చేసుకుని బతుకుతున్నాం అని గుర్తు చేశారు. మా జీవనాధారం పై పొట్ట గొట్టి కొందరు బడా రాజకీయవేత్తలు కుయుక్తులు పన్నుతున్నారని విమర్శించారు మా పొట్ట కొట్టిన బతుకులు సర్వ నాశనం అవుతాయని హెచ్చరించారు. పూడూరు గ్రామ ప్రజలు దామగుండం అటవీ ప్రాంతాన్ని నమ్ముకొని గత కొన్ని సంవత్సరాలుగా జీవిస్తున్నారని అన్నారు. ఏ ప్రభుత్వం వచ్చినా ప్రజల బాగోగుల గురించి ఆలోచించి ఆదాయం పెంచే విధంగా కృషి చేస్తుందని తెలిపారు. దట్టమైన అటవీ ప్రాంతం పచ్చని చెట్లతో నిండి ఉందని గుర్తు చేశారు. దామగుండం అడవిలో నేవీ రాడార్ ను ఏర్పాటు చేస్తే పూడూరు గ్రామ ప్రజలతో పాటు చుట్టుపక్కల ఉన్న ప్రజల గ్రామాల ప్రజలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటారని అన్నారు. మానవత్వంతో ఆలోచించి నేవీ రాడార్ ను ఏర్పాటు చేయవద్దని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో సుజాత శంకరమ్మ నీలమ్మ నీలమ్మ సత్యమ్మ అనంతమ్మ పెంటమ్మ జయమ్మ గ్రామ ఉపసర్పంచ్ తలారి రాజేందర్ వార్డ్ మెంబర్ సుదర్శన్ అనంత రాములు మల్లేష్ చంద్రశేఖర్ తదితరులు పాల్గొన్నారు.