అఖిలపక్షం ఆధ్వర్యంలోమిర్చి రైతులు రాస్తారోకో

Published: Tuesday June 21, 2022

మధిర  జూన్ 20 ప్రజాపాలన ప్రతినిధి కూరగాయల మార్కెట్ ను మధిర మిర్చి మార్కెట్ వద్దకు తరలించి మిర్చి రైతులకు స్థలం లేకుండా ఇబ్బందులకు గురి చేస్తున్నారని ఆరోపిస్తూ సోమవారం విజయవాడ రోడ్ లో రైతులు నిరసన వ్యక్తం చేశారు విషయం తెలుసుకున్న అఖిలపక్ష నేతలు రైతులు చేస్తున్న రాస్తారోకో కి మద్దతు ప్రకటించారు ఈ సందర్భంగా ప్రతిపక్షాలకు చెందిన నాయకులు సూరం శెట్టి కిషోర్, బెజవాడ రవి బాబు మందా సైదులు మాట్లాడుతూ ప్రజలకు అందుబాటులో ఉండాల్సిన రైతు బజార్ కూరగాయల మార్కెట్ ను ఊరికి దూరంగా ఉన్న మార్కెట్ యార్డులో ఏర్పాటు చేయటం వల్ల పట్టణ ప్రజలు తీవ్ర ఇబ్బందులకు గురవుతున్నారు అంతే కాకుండా ప్రజలకు దూరంగా కూరగాయల మార్కెట్ ఏర్పాటు చేయడంవల్ల వ్యాపారం లేక వ్యాపారులు కూడా ఆందోళన వ్యక్తం చేస్తున్నారు ఇదిలా ఉండగా ఇప్పటికే మార్కెట్ యార్డులో మిర్చి కొనుగోలు కేంద్రం ఏర్పాటు చేయడం జరిగిందని వారు తెలిపారు ఒకవైపు మిర్చి మార్కెట్ మరోవైపు రైతు బజార్ ఏర్పాటు చేయడంవల్ల ఇరువర్గాలకు ఇబ్బందిగా ఉందని వారు తెలిపారు అధికారులు తక్షణమే స్పందించి ప్రజలకు అందుబాటులో ఉండే విధంగా రైతు బజార్ ను ఏర్పాటు చేయాలని మిర్చి మార్కెట్ లో యధావిధిగా మిర్చి అమ్మకాలు చేపట్టాలని వారు డిమాండ్ చేశారు