కామ్రేడ్ గౌసుకు కన్నీటి వీడ్కోలు.

Published: Wednesday April 21, 2021

బెల్లంపల్లి ఏప్రిల్ 20 ప్రజాపాలన ప్రతినిధి : ఎం సి పి ఐ జాతీయ ప్రధానకార్యదర్శి కామ్రేడ్ మొహమ్మద్ గౌస్ మరణం యావత్ భారతదేశ వామపక్ష ఉద్యమానికి బడుగు బలహీన వర్గాలకు, దళిత జాతికి తీరని లోటుఅని ఎం సి పి ఐ యు రాష్ట్ర కార్యదర్శి వర్గ సభ్యులు మంచిర్యాల జిల్లా ప్రధాన కార్యదర్శి సబ్బని కృష్ణ అన్నారు. మంగళవారం నాడు బెల్లంపల్లి పట్టణం లోని కొత్త బస్టాండ్ చౌరస్తాలో ఏర్పాటుచేసిన కామ్రేడ్ మొహమ్మద్ గౌస్ సంతాప సభ లో ఆయన మాట్లాడుతూ  కష్టపడి  పనిచేస్తూ దోపిడిలేని, నవసమాజ నిర్మాణం కోసం, సమసమాజ స్థాపనకోసం, ఎర్ర జెండా ఎగురవేయడం కోసం శ్రమించి అస్తమించిన నాయకుడు అని అన్నారు. పార్టీ అభివృద్ది లో, కమ్యూనిస్టు భావజాలాన్ని వ్యాప్తి చేయడంలో అంచలంచలుగా ఎదుగుతూ, ఎం సి పి ఐ యు పార్టీ జాతీయ ప్రధానకార్యదర్శిగా ఎదిగి అలుపెరగని ఎన్నో ప్రజాఉద్యమాలు చేశారని గుర్తు చేసారు.ఆయన అందించిన ఎర్రజెండాను గుండెల్లో నింపుకొని దోపిడి పాలనకు చరమగీతం పాడడానికి ఉద్యమ కారులు ఐక్య ప్రజా ఉద్యమాలు చేసినప్పుడే ఎర్రజెండా లన్ని ఏకమైనప్పుడే ఆయనకు నిజమైన నివాళి అర్పించిన వాళ్ళం అవుతామనీ ఆయన అన్నారు. ఈ కార్యక్రమంలో జిల్లానాయకులు సబ్బని రాజేంద్రప్రసాద్, కొండ శ్రీనివాస్, ఆరెపల్లి రమేష్, బర్ల స్రవంతి, సబ్బని విజయలక్ష్మి, రాజశేఖర్, లింగంపల్లి శంకర్, అరుణ్, ఆకాష్, బొబ్బిలి రాజేష్, వెంకటేష్ తదితరులు పాల్గొన్నారు.