ఉపాధ్యాయ సంఘ నేతల అరెస్ట్ అప్రజాస్వామికం : ఉపాధ్యాయ సంఘ నేతలు

Published: Wednesday December 29, 2021

జగిత్యాల, డిసెంబర్ 28 (ప్రజాపాలన ప్రతినిధి): ఉపాధ్యాయులకై తెచ్చిన జీ.ఓ. 317లో సీనియారిటీని మాత్రమే పరిగణనలోకి తీసుకొని స్థానికతను ప్రభుత్వం విస్మరించడాన్ని నిరసిస్తూ ఉపాధ్యాయ సంఘాల పోరాట కమిటీ ముట్టడి కై తరలిన ఉపాధ్యాయుల అరెస్ట్ అప్రజాస్వామికమని ఉపాధ్యాయ సంఘాల నేతలు అన్నారు. సోమవారం యూఎస్పీసి ఇచ్చిన హైదరాబాద్ సెక్రటేరియట్ ముట్టడి నేపథ్యంలో జగిత్యాల లోని పలు ఉపాధ్యాయ సంఘాల నేతలను అర్ధరాత్రి పోలీసులు అరెస్ట్ చేశారు. ఈ సందర్భంగా ఉపాధ్యాయ సంఘాల నేతలు బోగ రమేష్, బైరం హరికిరణ్, వోడ్నాల రాజశేఖర్, తుంగురి సురేష్ లు మాట్లాడుతూ. రాష్ట్ర ప్రభుత్వం రాష్ట్రపతి ఉత్తర్వులను అనుసరించి రాష్ట్ర ప్రభుత్వం తెచ్చిన 317 జీవో లో కేవలం సినియారీటిని మాత్రమే పరిగణనలోకి తీసుకొని స్థానికతను తీసుకోకపోవడంతో చాలామంది జూనియర్ టీచర్లు  తమ సొంత జిల్లాలకు కాకుండా ఇతర జిల్లాలకు బలవంతంగా పోస్టింగ్ ఇస్తున్నారన్నారు. అలాగే ఉపాధ్యాయులకు పాఠశాలలు ఎంపిక చేసుకొనే వీలులేకుండా ఆదరా భాదరాగా అప్షన్లు కోరుతూ ప్రత్యక్ష కౌన్సిలింగ్ విధానం కాకుండా అధికారుల ద్వారా పోస్టింగ్లు ఇస్తూ అవినీతికి ఆస్కారం కల్పిస్తున్నారన్నారు. దీన్ని నిరసిస్తూ ఉపాధ్యాయ సంఘాల పోరాట కమిటీ ఇచ్చిన పిలుపు మేరకు హైదరాబాద్ తరలనున్న ఉపాధ్యాయ సంఘ నేతలను అర్ధరాత్రి అరెస్ట్ చేయడం అప్రజాస్వామికమని అన్నారు. ఎలాంటి లోపాలు లేకుండా టీచర్ల బదిలీల ప్రక్రియ ను చేపట్టాలని వారు డిమాండ్ చేశారు. అరెస్ట్ అయిన వారిలో టిపిటీఎఫ్ జిల్లా అధ్యక్షులు బోగ రమేష్, ఎస్టీయూ జిల్లా అధ్యక్షులు బైరం హరికిరణ్, తపస్స్ జిల్లా అధ్యక్షులు వోడ్నాల రాజశేఖర్, టి.ఆర్.టి.ఎఫ్. జిల్లా అధ్యక్షులు తుంగురి సురేష్ లు  ఉన్నారు.