విద్య, ఉపాధి రంగాలను గాలికి వదిలేసినా కేంద్ర బడ్జెట్.

Published: Wednesday February 02, 2022
ఎస్ఎఫ్ఐ జిల్లా కార్యదర్శి దుంపల రంజిత్ కుమార్.
మంచిర్యాల టౌన్, ఫిబ్రవరి 01, ప్రజాపాలన: కేంద్రం ప్రవేశ పెట్టిన కేంద్ర ఆర్థిక బడ్జెట్ లో విద్య, ఉపాధి రంగాలకు తీవ్ర అన్యాయం జరిగిందని ఎస్ఎఫ్ఐ జిల్లా కార్యదర్శి దుంపల రంజిత్ కుమార్ విమర్శించారు. లక్షేట్టిపేట్ ప్రభుత్వ జూనియర్ కళాశాల వద్ద మంగళవారం రోజున భారత విద్యార్థి ఫెడరేషన్ సమావేశం నిర్వహించారు. ఈ సందర్బంగా ఎస్ఎఫ్ఐ జిల్లా కార్యదర్శి దుంపల రంజిత్ కుమార్ మాట్లాడుతూ ప్రదానంగా దేశంలోని విద్య వ్యవస్థలో ఎప్పుడు కుడా జరగని మార్పులు ఇప్పుడు జరుగుతున్నాయని. కేంద్రంలో బీజేపీ అధికారంలోకి వచ్చిన తర్వాత పేద విద్యార్థులు చదుకునే ప్రభుత్వ విద్య రంగాన్ని నిర్వీర్యం చేస్తుందని. ముఖ్యంగా విద్యవ్యవస్థలో డిజిటల్ విద్య విధానం అంటూ ప్రతి తరగతికి ఒక ఛానెల్ అంటూ విద్య వ్యవస్థను పూర్తిగా కార్పొరేట్ చేతుల్లో పెట్టింది. దీని వాళ్ళ దేశంలో విద్యావ్యవస్థ మార్కెట్ లో అంగడి సరుకుగా మారుతుంది. కొఠారి కమిషన్ నివేదిక ప్రకారం కేంద్ర బడ్జెట్లో ఆరు శాతం నిధులు కేటాయించాల్సింది ఉండగా కనీసం ఒక శాతం కూడా నిధులు కేటాయించకపోవడం చాలా దారుణం అన్నారు. దీని వలన దేశంలోని విద్యార్థుల డ్రాపౌట్ సంఖ్య మరింత ఎక్కువగా పెరిగే అవకాశాలు ఉన్నాయి. ప్రస్తుతం ఉన్న ప్రభుత్వ యూనివర్సిటీలకు ఎలాంటి నిధులు కేటాయించకుండా డిజిటల్ యూనివర్సిటీల పేరుతో యూనివర్సిటీ విద్యను పేద విద్యార్థులకు అందనివ్వకుండా అడ్డుకునే ప్రయత్నంలో ఈ బడ్జెట్ ఉందని. ఈ కార్యక్రమంలో అమన్, సిద్దిక్, రాకేష్, జూనేత్ పాల్గొన్నారని తెలిపారు.