ప్రభుత్వ నిషేధిత ప్లాస్టిక్ ను వాడితే కఠిన చర్యలు

Published: Thursday November 24, 2022
మునిసిపల్ కమిషనర్ శరత్చంద్ర
వికారాబాద్ బ్యూరో 23 నవంబర్ ప్రజాపాలన : రాష్ట్ర ప్రభుత్వం నిషేధించిన ప్లాస్టిక్ ను వ్యాపారస్తులు ఎవరైనా వాడితే కఠిన చర్యలు తీసుకుంటామని మునిసిపల్ కమిషనర్ శరత్చంద్ర అన్నారు. బుధవారం వికారాబాద్ మున్సిపల్ కేంద్రంలోని పలు హోల్సేల్ కిరాణా దుకాణాలలో ఆకస్మిక తనిఖీలు నిర్వహించి నిషేధిత ప్లాస్టిక్ను పట్టుకున్నారు. ఈ సందర్భంగా కమిషనర్ మాట్లాడుతూ వ్యాపారస్తులు క్రయవిక్రయాలు జరిపేందుకు నిత్యావసర వస్తువులను నిషేధిత ప్లాస్టిక్ సంచులలో వేసి ఇస్తున్న పక్కా సమాచారం మేరకు పలు దుకాణాలలో తనిఖీలు నిర్వహించామని పేర్కొన్నారు. ఎ.ఆనందం కిరాణం దుకాణం యజమానికి రూ. 500 లు, సంగమేశ్వర హోమ్ నీడ్స్ దుకాణం యజమాని రాములు కు రూ. 3000 లు, జగదీశ్వర్ కు రూ.3000 లు, సత్యనారాయణకు రూ. 200 లు, శ్రీనివాస్ కు రూ. 200 లు రైల్వే స్టేషన్ రూట్ లో ఉన్న కిరాణా దుకాణాల యజమానులకు జరిమానా విధించామని కమిషనర్ తెలిపారు. నిషేధిత ప్లాస్టిక్  వినియోగిస్తున్న హోల్ సేల్ కిరాణం దుకాణం యజమానులపై మొత్తం రూ. 6,900 లు జరిమానా విధించామని స్పష్టం చేశారు. కొనుగోలుదారులు, విక్రయదారులు ఎవరైనా సరే ప్రభుత్వం నిషేధించిన ప్లాస్టిక్ ను వాడితే చట్టపరంగా కఠిన చర్యలు తీసుకుంటామని వికారాబాద్ మున్సిపల్ కమిషనర్ శరత్ చంద్ర హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో శానిటరీ ఇన్స్పెక్టర్ సయ్యద్ మొహియొద్దిన్, హెల్త్ అసిస్టెంట్ బి ఏసుదాసు, ఎన్విరాన్మెంట్ ఇంజనీర్ ఈ శ్రీనివాస్, శానిటరీ జవాన్లు కే. ఆశయ్య, ఎ. వినోద్ కుమార్, జే చిన్నయ్య, బి.రాజు, వై. శంకర్ తదితరులు పాల్గొన్నారు.