ప్రిన్సిపల్ జూనియర్ సివిల్ జడ్జ్ శ్రీ ధీరజ్ కుమార్ కి అభినందనలు తెలిపిన జిల్లా

Published: Wednesday February 15, 2023

 తెలిపిన జిల్లా ఆర్యవైశ్య మహాసభ మధిర ఫిబ్రవరి 14 ప్రజా పాలన ప్రతినిధి మున్సిపాలిటీ పరిధిలోమధిర కోర్టు భవనం శిథిలావస్తకు వచ్చి కోర్టు నిర్వహణ చేయలేక మధిర పశువుల హాస్పిటల్ లో కోర్టు నిర్వహించబడుతుంది. సదరు విషయాన్ని మధిర ప్రిన్సిపల్ జూనియర్ సివిల్ జడ్జి శ్రీ డి. ధీరజ్ కుమార్ ఖమ్మం జిల్లా జడ్జి శ్రీ డాక్టర్ టి. శ్రీనివాసరావు గారి ద్వారా ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లి నూతన కోర్టు భవనానికి 21 కోట్లు మంజూరు అవటానికి కృషి చేసిన సందర్భంగా ఖమ్మం జిల్లా ఆర్యవైశ్య మహాసభ ఆధ్వర్యంలో మధిర ప్రిన్సిపల్ జూనియర్ సివిల్ జడ్జ్ శ్రీ. ధీరజ్ కుమార్ కి అభినందనలు తెలియజేయడం జరిగింది.అంతేగాకుండా సదరు విషయాన్ని ఎన్నోసార్లు ప్రభుత్వం దృష్టికి తీసుకు వెళ్ళటానికి కృషిచేసిన మధిర బార్ అధ్యక్షులు శ్రీ బి. పుల్లారావు ని ప్రధాన కార్యదర్శి శ్రీ కే. జ్ఞానేష్ ని మరియు కార్యవర్గ సభ్యులందరినీ కూడా అభినందించడం జరిగింది.ఈ సందర్భంగా ఖమ్మం జిల్లా ఆర్యవైశ్య మహాసభ అధ్యక్షులు వనమా వేణుగోపాలరావుు ఈ సందర్భంగా మాట్లాడుతూ ప్రభుత్వం మంజూరు చేసిన 21 కోట్లు చక్కగా సద్వినియోగం చేసి మంచి భవనాన్ని నాణ్యమైన మెటీరియల్ వాడి కట్టుబడి చేసే విధంగా మధిర బార్ అసోసియేషన్ సభ్యులందరూ కూడా నూతన భవనం కట్టుబడి విషయంలో తమ సేవలు అందించి కక్షిదారులందరికీ ఉపయోగపడే విధంగా త్వరగా నిర్మాణం పూర్తయ్యేటట్లు చూడాలని విజ్ఞప్తి చేశారు.*
ఈ కార్యక్రమంలో ఖమ్మం జిల్లా ఆర్యవైశ్య మహాసభ అధ్యక్షులు వనమా వేణుగోపాలరావు, ఉపాధ్యక్షులుశ్రీ వాసవి ఆర్యవైశ్య కళ్యాణ మండపం అధ్యక్షులు కురువెళ్ల వెంకట పురుషోత్తమరావు, మహాసభ ఆర్గనైజింగ్ సెక్రటరీ చారుగుండ్ల నరసింహమూర్తి, అధికార ప్రతినిధి కుంచం కృష్ణారావు, పుల్లఖండం సత్యనారాయణమూర్తి, విద్యా కమిటీ చైర్మన్ వంగవేటి రాజశేఖర్, కాజా చక్రధర్ రావు తదితరులు పాల్గొన్నారు.*