ఇబ్రహీంపట్నం జూన్ తేది 30 ప్రజాపాలన ప్రతినిధి.

Published: Friday July 01, 2022
మానసిక  వికలాంగురాలిపై అత్యాచారం చేసిన వ్యక్తినీ కటినంగా శిక్షించాలి*

*రంగారెడ్డి జిల్లా కమిటి సభ్యులు ఎన్ పి అర్ డి ఆశన్నా  భుజంగారెడ్డి డిమాండ్

*2016 అర్పిడి చట్టం ప్రకారం కేసు నమోదు చేయాలి*

నల్గొండ జిల్లా చిట్యాల మండలం ఉరుమడ్ల  గ్రామానికి చెందిన మానసిక వికలాంగురాలు మందుల సువర్ణపై అత్యాచారం చేసిన వ్యక్తినీ కటీనంగా శిక్షించాలని వికలాంగుల హక్కుల జాతీయ వేదిక, ఎన్ పి అర్ డి మహిళా విభాగం రాష్ట్ర కమిటీలుడిమాండ్ చేస్తున్నవి
జూన్ 25 నాడు గ్రామంలో ఇంట్లో ఎవ్వరూ లేనీ సమయంలో మానసిక వికలాంగురాలైన మందుల సువర్ణ మీద అదే గ్రామానికి చెందిన జనపాల శంకర్ లైంగిక దాడి చేశారు. ఈ ఘటనను త్రీవ్రంగ ఖండిస్తున్నాం. మానసిక వికలాంగురాలిపై అత్యాచారం చేసిన శంకర్ పై 2016 RPD చట్టం సెక్షన్ 92(బి)(డి) ల ప్రకారం కేసు నమోదు చేయాలి . తెలంగాణ రాష్ట్రంలో మానసిక, ముగ చెవిటి మహిళా వికలాంగులపై లైంగిక దాడులు, అత్యాచారాలు ప్రతి రోజు ఏదో ఒక ప్రాంతంలో జరుగుతున్నవి. నిందితులను పట్టుకునేందుకు పోలీసులు ఎలాంటి చర్యలు చేపట్టడం లేదు. పోలీసుల, ప్రభుత్వం నిర్లక్షం మూలంగానే ఎలాంటి ఘటనలు జరుగుతున్నాయి. అయిన ప్రభుత్వం మాత్రం పట్టించుకోవడం లేదు. పాస్ట్ ట్రాక్ కోర్టు ఎర్పాటు చేసి నిందితున్ని కఠినంగా శిక్షించాలి. బంగారు తెలంగాణ రాష్ట్రంలో మానసిక వికలాంగులకు రక్షణ లేకుండా పోతుంది.సకలంగుల మహిళలపై ఘటనలు జరిగినప్పుడు ప్రభుత్వాలు, సంఘాలు సంస్థలు స్పందిస్తున్నారు కానీ మహిళా వికలాంగులపై దారుణాలు జరిగినప్పుడు మాత్రం ఎవ్వరూ పట్టించుకోవడం లేదు తక్షణమే ప్రభుత్వం స్పందించాలనీ మహిళా వికలాంగుల రక్షణ కోసం ప్రత్యేక చట్టం చేయాలనీ, లైంగిక దాడికి గురి అయిన మానసిక వికలాంగులరలికి న్యాయం జరిగే వరకు ఉద్యమం చేస్తామని హెచ్చరించారు . ఈ కార్యక్రమంలో
రంగారెడ్డి జిల్లా కమిటి సభ్యులు అశన్న  భుజంగారెడ్డి, జెర్కోని రాజు, రాజశేఖర్ గౌడ్, తదితరులు పాల్గొన్నారు.