ఆళ్లపాడు గ్రామంలో గోపాల మిత్ర క్యాంపు విజయవంతం

Published: Thursday February 02, 2023
బోనకల్, ఫిబ్రవరి 1 ప్రజా పాలన ప్రతినిధి: మండల పరిధిలోని ఆళ్ళపాడు గ్రామంలో మంగళవారం జరిగిన గోపాల్ మిత్ర క్యాంపును సర్పంచ్ మర్రి తిరుపతిరావు చేతుల మీదుగా ప్రారంభించారు. ఈ కార్యక్రమం నందు మండల డాక్టర్ పి. నాగేశ్వరావు 28 నల్ల పశువులకు, 10 తెల్ల పశువులకు, గర్భకోశ వ్యాధి నివారణ చికిత్స , మందులు ఉచితంగా అందజేశారు. గేద దూడలకు నట్టల మందులు త్రాగించడం జరిగినది. ఈ కార్యక్రమానికి గ్రామంలోని రైతులు బుంగ లక్ష్మయ్య , మరీదు వెంకటేశ్వర్లు,మోదుగు రమేష్ , పశువైద్య సిబ్బంది గోపాల్ మిత్ర సూపర్వైజర్ మోతుకూరి వెంకటేశ్వర్లు, లైవ్ స్టాక్ అసిస్టెంట్ నాగేంద్ర కుమార్ ,గ్రామ గోపాల మిత్రులు అశోక్, నాగేశ్వరావు పాల్గొన్నారు.