ముమ్మరంగా వాక్సిన్ డ్రైవ్

Published: Wednesday September 22, 2021
ర్ధరాత్రి గ్రామాలు సందర్శించిన జడ్పీ సీఈఓ అప్పారావు
మధిర ప్రజాపాలన ప్రతి నది సెప్టెంబర్20 నాలుగు రోజులు నుoడి మండలంలో జిల్లా వైద్య ఆరోగ్య ద్వారా జిల్లా కలెక్టర్ ఆదేశాలు మేరకు జిల్లా పరిషత్ చైర్మన్ శ్రీ లింగాల కమలరాజ్ సూచనల మేరకు మండల పరిధిలో ఎంపీడీఓ శ్రీ విజయభాస్కర్ రెడ్డి పిహెచ్సి మాటూరుపేట డా.వెంకటేష్ పిహెచ్సి దెందుకూరు డా.శశిధర్ ఐకేపీ ఎపిఒ రాంబాబు ఐసిడిఎస్ సీడీపీఓ శారదా శాంతి, ఈఒపిఆర్డీ రాజారావు బృందం సంయుక్తoగా గ్రామాల్లో తిరుగుతూ ఇంటింటికి కరోనా వాక్సిన్ డ్రై వ్ చేపడుతున్నారు. ఇందుకు ప్రతి గ్రామ ప్రజా ప్రతినిధులు సర్పంచ్ లు ఎంపీటీసీలు ఎంపీపీగారు మొండెం లలిత గ్రామాల్లో అందరు ప్రజా ప్రతినిధులు కృషి మరువ లేనిది. పిహెచ్సి దెందుకూరు పిహెచ్సి మాటూరుపేట విభాగం నుండీ ఆరోగ్య పరివేక్ష కులు వి భాస్కర్ రావు ఆర్ సుబ్బలక్ష్మి లంకా కొండయ్య Hv మరియరాణి hv కాంతలీల సిహెచ్ఓ సుభాషిణి టీంలు వారీగా వాక్సిన్ డ్రైవ్ నడిపిస్తునారు. రాత్రి వేళ గ్రామoలో వీధి లైట్ల వద్ద మొబైల్ క్యాంపులు ఏర్పాటు చేసి కరోనా వాక్సిన్ టార్గెట్ రీచ్ చేస్తున్నారు. అంగన్వాడీ ఐకేపీ జిపి సిబ్బంది ఆశ కార్యకర్తలు ఎఎన్ఎం లు మండలంలో సీనియర్ జిపి సెక్రటరీలు ఆతుకురు శ్రీధర్ రెడ్డి నిదనాపురం హరికుమార్ జూనియర్ జిపి సెక్రటరీలను కలుపుకొని  వాక్సిన్ డ్రైవ్ లో చురుకుగా పాల్గొంటున్నారు. బృందాలుగా విడిపోయి వాక్సిన్ డ్రైవ్ విజయవంతం చేస్తున్నారు. ఎంపీడీఓ  ఈఒపిఆర్డీ `వైద్య సిబ్బంది నిద్రహారాలు మాని టార్గెట్ రీచ్ కు కృషి చేస్తున్నారు. హెల్త్ అసిస్టెంట్ లు వాక్సిన్ ప్రతి గ్రామానికి అవసరాన్ని బట్టి త్వరగా డoపు చేస్తున్నారు. ఎంపీడీఓ ఆఫీస్ సిబ్బంది ప్రతి గంటకు వాక్సిన్ డోస్ లు నివేదిక జిల్లా కు పంపిస్తున్నారు. గత మూడు రోజులు క్రితం జిల్లాపరిషత్ సీఈఓ అప్పారావు సిరిపురం ఆతుకూరు, దెందుకూరు గ్రామాల్లో పరివేక్షణ చేసి అర్ధరాత్రి సహితం వాక్సిన్ డ్రై వ్ పరిశీలించి ఎఎన్ఎం లు కృషి అభినందనియం అని తెలియజేసినారు. మండలంలో కొన్ని గ్రామాల్లో స్వయానాడా వెంకటేష్ డా శశిధర్ లు ఎఎన్ఎం లకు వాక్సిన్ డoపు చేస్తూ కొన్ని చోట్లా కొంత మంది బెడ్ రెస్ట్ లో వున్న వృద్దులకు 80 సంవత్సరాలు పైబడిన వారికీ డాక్టర్స్ బృందం వాక్సిన్ చేయటం అభినందనియం.