కేసుల దర్యాప్తు లో నాణ్యత పాటించాలి ** జిల్లా ఎస్పీ కే సురేష్ కుమార్ ** పెండింగ్ కేసులపై సమీక్

Published: Wednesday February 15, 2023
ఆసిఫాబాద్ జిల్లా ఫిబ్రవరి 14 (ప్రజాపాలన, ప్రతినిధి) :జిల్లా లో ఆయా పోలీస్ స్టేషన్ లలో నమోదయి పెండింగ్ లో ఉన్న కేసులలో క్వాలిటీ ఆఫ్ ఇన్వెస్టిగేషన్ ను పెంపొందించి సత్వర  పరిష్కారం కు బాధ్యతగా కృషి చేయాలని జిల్లా ఎస్పీ కే.సురేష్ కుమార్  పోలీస్ అధికారులకు సూచించారు. మంగళవారం
పోలీస్ హెడ్ క్వార్టర్స్ లోని కాన్ఫరెన్స్ హాల్ లో ఎస్పీ  నెలవారీ నేరసమీక్ష సమావేశం నిర్వహించి ఓల్డ్ యు.ఐ, గ్రేవ్ కేసులు, ఎస్సీ, ఎస్టీ కేసులు, కాంటెస్టెడ్ కేసులపై  రివ్యూ నిర్వహించారు. నమోదయిన కేసులలో శిక్షల శాతం ను పెంచేందుకు సమీక్ష నిర్వహించరు.ఈ సందర్భంగా జిల్లా ఎస్పీ మాట్లాడుతూ జిల్లాలో అన్ని పోలీస్ స్టేషన్ ల పరిధిలో పెండింగ్ లో  ఉన్న కేసుల సత్వర పరిష్కారానికి పోలీసు అధికారులందరూ న్యాయధికారులతో  బాధ్యతగా వ్యవహరించాలని సూచించారు.  పెండింగ్ కేసులను పూర్తిస్థాయిలో ఇన్వెస్టిగేషన్ చేసి, డిస్పోజల్ చేయాలని సూచించారు. కేసు నమోదు నుండి చార్జిషీట్ వరకు ప్రతి విషయాన్ని పరిశోధన చేసి ఫైనల్ చేయాలన్నారు. పోక్సో, ఎస్సీ ఎస్టీ కేసులలో 60 రోజుల్లో ఇన్వెస్టిగేషన్ పూర్తి చేసి ఛార్జిషీట్ దాఖలు చేయాలన్నారు.ప్రతిరోజు ఉదయం సాయంత్రం విజిబుల్  పోలీసింగ్ లో భాగంగా వాహనాల తనిఖీలు నిర్వహించాలని తెలిపారు. సీసీ కెమెరాలను ప్రతిరోజూ మానిటర్ చేయాలని,పని చెయ్యని సీసీ కెమెరాలను వెంటనే బాగు చేయించాలని సూచించారు. ప్రజలకు ప్రజాప్రతినిధులకు యువకులకు గ్రామాల విపిఓలు, పోలీస్ అధికారులు, సిబ్బంది అవగాహన కార్యక్రమాలు నిర్వహించాలని  సూచించారు.11/02/2023 న జరిగిన లోక్ అదాలత్ లొ ఎక్కువ కేసుల రాజీ కి తోడ్పడిన పోలీస్ స్టేషన్ లలో మొదటి స్థానం లో కాగజ్ నగర్ టౌన్, రెండవ స్థానంలో రెబ్బెన పోలీస్ స్టేషన్ లు  నిలిచినందుకు ఎస్ఐ లు చంద్రశేఖర్, భుమేష్ లకు ఎస్పీ  క్యాష్ రివాడ్స్ అందించి, అభినందించారు.  అనంతరం  వజ్రోత్సవ వేడుకల్లో భాగంగా పోలీస్ శాఖలో చేస్తున్న కృషికి  జిల్లా పోలిస్ అధికారులందరికీ ఎస్పి మెడల్స్ బహూకరించారు.ఈ సమావేశంలో అదనపు ఎస్పీ (అడ్మిన్) అచ్చేశ్వర్ రావు, అదనపు ఎస్పి (ఎ.ఆర్) భీమ్ రావు, ఆసిఫాబాద్ డిఎస్పి   శ్రీనివాస్,సి.ఐ లు,ఎస్.ఐలు, , ఐ.టి కోర్ సిబ్బంది పాల్గొన్నారు.