డయల్ యువర్ చైర్ పర్సన్ కు 13 ఫిర్యాదులు

Published: Friday March 10, 2023
* వికారాబాద్ మున్సిపల్ చైర్ పర్సన్ మంజుల
వికారాబాద్ బ్యూరో 09 మార్చి ప్రజాపాలన : గతవారం వచ్చిన 21 ఫిర్యాదులలో 6 సమస్యలను పూర్తిగా పరిష్కరించామని వికారాబాద్ మున్సిపల్ చైర్ పర్సన్ చిగుళ్ళపల్లి మంజుల మంజుల రమేష్ అన్నారు. 14వ వారం వరకు ప్రతి సోమవారం నిర్వహించిన డయల్ యువర్ చైర్ పర్సన్ కార్యక్రమాన్ని గురువారానికి మార్చబడిందని పేర్కొన్నారు. గురువారం నిర్వహించిన డయల్ యువర్ చైర్ పర్సన్ కార్యక్రమానికి 13 ఫిర్యాదులు అందాయని వివరించారు. 2 ఫిర్యాదులు నిధులతో కూడుకున్నవని స్పష్టం చేశారు. మిగతావి అండర్ ప్రాసెస్ లో ఉన్నాయని తెలిపారు. గురువారం నాటి ఫిర్యాదులలో డ్రైనేజీ సమస్యలు, స్ట్రీట్ లైట్లు, వీధి కుక్కలపై ఫిర్యాదులు అందాయని చెప్పారు. వీటిని కూడా వీలైనంత త్వరలో పరిష్కరిస్తామని వెల్లడించారు.