బంగారు మైసమ్మ తల్లి ఆశీర్వాదంతో 18వ వార్డు ప్రజలు సంతోషంగా ఉండాలి

Published: Thursday March 18, 2021
18 వ వార్డు కౌన్సిలర్ కొండేటి కృష్ణ
వికారాబాద్ జిల్లా ప్రతినిధి మార్చి 17 ( ప్రజాపాలన ) : బంగారు మైసమ్మ తల్లి ఆశీర్వాదంతో 18వ వార్డు ప్రజలందరూ సుఖ సంతోషాలతో జీవించాలని వార్డ్ కౌన్సిలర్ కొండేటి కృష్ణ మొక్కులు చెల్లించుకున్నారు. బుధవారం వికారాబాద్ మున్సిపల్ పరిధిలోని రామయ్య గూడకు చెందిన 18 వ వార్డులో బంగారు మైసమ్మ తల్లి గుడిలో గత మూడు సంవత్సరాల క్రితం కొండేటి కుటుంబం ఆధ్వర్యంలో విగ్రహాన్ని ప్రతిష్టించారు. ప్రతి సంవత్సరం బంగారు మైసమ్మ తల్లి పూజా కైంకర్యాలలో కొండేటి కృష్ణ కొండేటి అనూష కొండేటి అనిల్ కుమార్ కొండేటి లలిత పుణ్య దంపతులు కొండేటి కుటుంబం ఆధ్వర్యంలో అర్చకుడు ప్రత్యేక వేద మంత్రోచ్ఛారణల మధ్య పూజా కైంకర్యాలు నిర్వహించారు. ఈ సందర్భాన్ని పురస్కరించుకొని 18వ వార్డ్ కౌన్సిలర్ కొండేటి కృష్ణ మాట్లాడుతూ గత మూడు సంవత్సరాల క్రితం కేవలం కుటుంబ సభ్యులతో మాత్రమే ప్రత్యేక పూజలు నిర్వహించే వారమని, ప్రస్తుతం వార్డు కౌన్సిలర్ గా ఎన్నుకున్న ప్రజల తరఫున పూజలు నిర్వహించడం చాలా సంతోషంగా ఉందన్నారు. వార్డు ప్రజలందరూ సుఖ సంతోషాలతో ఆయురారోగ్యాలతో ఆర్థికంగా ఎదగాలని ఆకాంక్షించారు. ప్రజా సంక్షేమమే వార్డులో అభివృద్ధి పనులు చేపడతానని ఈ సందర్భంగా గుర్తు చేశారు. ప్రజలకు అందుబాటులో ఉండి ప్రజల నోటిలో నాలుకలా వ్యవహరిస్తానని అన్నారు. ఈ పూజా కార్యక్రమంలో మున్సిపల్ మాజీ వైస్ చైర్మన్ చిగుళ్ల పల్లి రమేష్ కుమార్ కౌన్సిలర్లు చిట్యాల అనంత రెడ్డి ఆర్ నర్సింలు వార్డు ప్రజలు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.