దుబ్బాక ఎన్నికల ప్రచారంలో ఎమ్మెల్యే డాక్టర్ మెతుకు ఆనంద్

Published: Thursday October 29, 2020

వికారాబాద్ జిల్లా ప్రతినిధి అక్టోబర్ 27 ( ప్రజాపాలన ) : ట్రబుల్ షూటర్ రాష్ట్ర ఆర్ధిక శాఖ మంత్రి వర్యులు హరీష్ రావుతో దుబ్బాక ఎలక్షన్ క్యాపింగ్ లో పాల్గొన్న వికారాబాద్ ఎమ్మెల్యే డాక్టర్  మెతుకు ఆనంద్. బుధవారం దుబ్బాక ఉప ఎన్నికల ప్రచారంలో భాగంగా సోలిపేట సుజాతకు మద్దతుగా తన సహచరులతో కలిసి ప్రచార పర్వం నిర్వహించారు. ఈ ప్రచార పర్వంలో  వికారాబాద్  నియోజకవర్గంలోని మార్కెట్ కమిటీ చైర్మన్ లు, పిఏసిఎస్ చైర్మన్ లు, ఎంపీపీలు, వైస్ ఎంపీపీలు, టిఆర్ఎస్ పార్టీ అధ్యక్షులు, ఎంపీటీసీలు, కౌన్సిలర్లు, టిఆర్ఎస్ పార్టీ సర్పంచుల సంఘం అధ్యక్షులు, సర్పంచులు,  ఎంపీటీసీల ఫోరమ్ అధ్యక్షులు, పార్టీ ముఖ్య నాయకులు,  ఆనంద్ అన్న సోషల్ మీడియా సైన్యం,  పార్టీ  కార్యకర్తలు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.