యాదాద్రి భువనగిరి జిల్లా 05 సెప్టెంబర్ ప్రజాపాలన:

Published: Wednesday September 07, 2022
ఉపాధ్యాయ దినోత్సవం సందర్బంగా రోటరీ క్లబ్ ఆఫ్ భువనగిరి ఆధ్వర్యంలో పలువురు ఉపాధ్యాయులను వివిధ మండలాల పరిధిలో ఘనంగా సత్కరించారు. ఈ సందర్భంగా అసిస్టెంట్ గవర్నర్ గడ్డం జ్ఞాన ప్రకాష్ రెడ్డి మాట్లాడుతూ...
సమాజం అభివృద్ధి కొరకు మరియు విద్యార్థుల భవిష్యత్తు గురించి పాటుపడే వారు  ఉపాద్యాయులు మాత్రమే అని అన్నారు. ఉపాధ్యాయుల సేవలను గుర్తించడం మన కర్తవ్యం అని అభిప్రాయపడ్డారు.
 
యాదాద్రి భువనగిరి జిల్లా లో  బొమ్మల రామారం, తుర్కపల్లి మండలంలో పనిచేస్తున్న ఐదుగురు గురు ఉపాధ్యాయులను సన్మానించారు. ప్రాథమిక పాఠశాల, నాయకుని తండా వద్ద అధ్యక్షులు బండారు శ్రీనివాస్ రావు, కార్యదర్శి కరిపే నర్సింగ్ రావు  రోటరీ క్లబ్ ఆఫ్ భువనగిరి పోర్ట్ ఆధ్వర్యంలో 05 గురు ఉపాధ్యాయులను వైస్సార్ గార్డెన్స్ భువనగిరి లో కోశాధికారి సబ్నకర్ వెంకటేష్ తదితరులు సన్మానించారు. రోటరీ క్లబ్ ఆఫ్ భువనగిరి సెంట్రల్ ఆధ్వర్యంలో 25 మంది ప్రైవేట్ పాఠశాలల కరెస్పాండెన్స్ లను వివేరా మినీ ఫంక్షన్ హల్, భువనగిరి నందు అధ్యక్షులు సద్ది వెంకట్ రెడ్డి , కార్యదర్శి ఫక్కీర్ కొండల్ రెడ్డి తదితరులు సన్మానించారు. ముఖ్య అతిథిలుగా జిల్లా విద్యాశాఖ అధికారి కె.నారాయణ రెడ్డి, బొమ్మల రామారం మండల ప్రజా పరిషత్ అధ్యక్షులు చిమ్ముల సుధీర్ రెడ్డి, ఎంపీడీఓ బి.సరిత, మండల విద్యాధికారి కృష్ణ, బి.లక్ష్మీనారాయణ ఆయా క్లబ్ ల కార్యవర్గ సభ్యులు, , ఉపాద్యాయులు తదితరులు ఈ కార్యక్రమ సభల్లో పాల్గొని విజయవంతం చేశారు.