దహన సంస్కారాలు మున్సిపాలిటీ వారే ఉచితంగా నిర్వహించాలి

Published: Wednesday May 26, 2021
సిపిఐ పట్టణ కార్యదర్శి బెజవాడ రవి
మధిర, ప్రజాపాలన ప్రతినిధి : 25వ తేదీ మధిర మున్సిపాలిటీ పరిధిలో కరోనా తో మరణించిన వారికి అయ్యే దహన సంస్కారాల ఖర్చును భరించలేని స్థితిలో మృత్తుల కుటుంబాలు తీవ్ర మనోవేదన కుగురవుతున్నారు. అస్సలే హాస్పిటల్, మందుల ఖర్చులు భరించలేక అప్పుల పాలవుతున్న పేద మధ్య తరగతి కుటుంబాలు దహన సంస్కారాలకోసం మళ్ళీ మళ్ళీ అప్పులు చేయాల్సిన దవుర్భాగ్య పరిస్థితి లో అల్లాడుతున్నారు. దయచేసి మధిర మున్సిపల్ చైర్మెన్ లత గారిని వైస్ చేర్మెన్ విద్యాలత గారిని పాలకవర్గ సభ్యులకు చేతులు జోడించి చేయు విన్నపము. కరోనాతో పోరాటంలో ఆర్ధికంగా చితికి పోయి అల్లాడిన కుటుంబాలకు కాస్త మనోధైర్యం కల్గించడం కోసం మన రాష్ట్రంలో అనేక స్థానిక సంస్థలు ముందుకొచ్చి బాధిత కుటుంబాలకు మనోధైర్యం నింపుతున్నారు. మనసున్న మధిర మున్సిపాలిటీ పాలకవర్గం కరోనా తో మరణించిన వారికి మున్సిపాలిటీ వారి ఆధ్వర్యంలో ఉచిత దహన సంస్కారాలు నిర్వహించాలని కరోనా బాధిత కుటుంబాల పక్షాన చేర్మెన్ గారిని పాలకవర్గ సభ్యులను కోరుతున్నాము.