ఎస్ ఐ, కానిస్టేబుల్ అభ్యర్థులకు న్యాయం చేయాలి:ఏ ఐ వై ఎఫ్ జిల్లాసమితి డిమాండ్ కరీంనగర్ నవంబర్

Published: Monday November 07, 2022
ఇటీవల రాష్ట్ర ప్రభుత్వం ప్రకటించిన ఎస్సై- కానిస్టేబుల్ ప్రాథమిక రాత పరీక్షల ఫలితాలలో అభ్యర్థులకు తీవ్ర నష్టం జరిగిందని,తప్పుగా వచ్చిన కానిస్టేబుల్ ప్రశ్నపత్రం లో  22,ఎస్ఐ ప్రశ్నపత్రంలో 7 కు తప్పిద మార్కులను కలపకుండానే ఫలితాలు వెల్లడించారని,ఈ వెల్లడితో రాష్ట్ర వ్యాప్తంగా లక్షలాది మంది అభ్యర్థులు తీవ్రంగా నష్ట పోయారని, దీనికి రాష్ట్ర ప్రభుత్వం పూర్తి బాధ్యత వహించాలని,తెలంగాణ స్టేట్ లెవెల్ పోలీసు రిక్రూట్మెంట్ బోర్డ్(టి ఎస్ పి ఎల్ఆర్ బి)ను ప్రక్షాళన చేయాలని డిమాండ్ చేస్తూ అఖిల భారత యువజన సమాఖ్య (ఏ ఐ వై ఎఫ్) కరీంనగర్ జిల్లా సమితి ఆధ్వర్యంలో  రాష్ట్ర ప్రభుత్వ దిష్టిబొమ్మ దగ్ధం చేసారు.
ఈ సందర్భంగా ఏ ఐ వై ఎఫ్ జిల్లా అధ్యక్షుడు, కసిబోజుల సంతోష్ చారి ప్రధాన కార్యదర్శి బ్రాహ్మణ పెళ్లి యుగంధర్ లు సంయుక్తంగా మాట్లాడుతూ...ఎస్సై-కానిస్టేబుల్ ప్రిలిమినరీ కటాఫ్ మార్కులలో జరిగిన అవకతవకలపై న్యాయ విచారణ జరపాలని వారు డిమాండ్ చేశారు.తప్పుడు ప్రశ్నలతో అభ్యర్థులు తీవ్రంగా నష్టపోయారని,తప్పుగా ఇచ్చిన 22 ప్రశ్నలకు.. 22 మార్కులు ఇవ్వాలని,క్వాలిఫై మార్కులు వచ్చినప్పటికీ.. ఎస్సి, ఎస్టీ, బీసీ అభ్యర్థులను లిస్ట్ లో పెట్టలేదని,ప్రతి అభ్యర్థి మార్క్ లిస్ట్ రిలీజ్ చేయాలని,7 లక్షల మంది నిరుద్యోగుల జీవితాలతో ప్రభుత్వం చెలగాటం ఆడుతోందని వారు ఆవేదన వ్యక్తంచేశారు. అన్యాయంపై అభ్యర్థులు అనేక రోజులుగా ఉన్నాతాధికారుల చుట్టూ తిరుగుతున్నా పోలీస్ రిక్రూట్ మెంట్ బోర్డు చైర్మన్ శ్రీనివాస్ రావు పట్టించుకోవడం లేదన్నారు. ఎస్సై, కానిస్టేబుల్ పరీక్షలో క్వాలిఫై మార్కులు వచ్చినా లిస్టులో పేర్లు లేవని, ఈఘటనలతో ఇప్పటికే 8 మంది అభ్యర్థులు ఆత్మహత్య చేసుకుని చనిపోయారని ఆవేదన వ్యక్తంచేశారు. 6 లక్షల 3 వేల మంది కానిస్టేబుల్ అభ్యర్థులు పరీక్షలు రాస్తే బోర్డు తప్పిదం వలన లక్షా 90 వేల మంది మాత్రమే క్వాలి ఫై అయ్యారని, 2 లక్షల 50 మంది ఎస్సై పరీక్ష రాస్తే 1 లక్ష 5 వేల మంది క్వాలి ఫై అయ్యారని, మిగిలిన వారి పరిస్థితి ఏంటని ప్రశ్నించారు. తెలంగాణ రాష్ట్ర సాధన కోసం ఆత్మహత్యలు చేసుకున్న విద్యార్థులు, నిరుద్యోగులు నేడు స్వరాష్ట్రంలో కూడా న్యాయం కోసం ఆత్మహత్యలు చేసుకోవడం కేసీఆర్ అసమర్థ పాలనకు నిదర్శనమన్నారు.అభ్యర్థులకు అసెంబ్లీ సాక్షిగా న్యాయం చేస్తామని చేసిన ప్రకటనను, ముఖ్యమంత్రి కేసీఆర్ నిలబెట్టుకోవాలని ఎస్సై, కానిస్టేబుల్ అభ్యర్థులకు న్యాయం చేయాలని లేనిపక్షంలో లక్షలాది మంది అభ్యర్థులతో కలిసి ప్రగతి భవన్ ముట్టడిస్తామని హెచ్చరించారు
ఈ కార్యక్రమంలో ఎ ఐ వై ఎఫ్నగర అధ్యక్ష కార్యదర్శులు మాడిశెట్టి అరవింద్, చంచల మురళి నాయకులు బండి సంపత్,సదానందం,శ్రావణ్,ప్రభాకర్ తదితరులు  పాల్గొన్నారు.