ఆదర్శ అంగన్వాడి సెంటర్ కు భూమి పూజ జెడ్పి చైర్ పర్సన్ కోవ లక్ష్మి ** ఆసిఫాబాద్ జిల్లా, జనవరి 20

Published: Saturday January 21, 2023
జిల్లా కేంద్రంలోని జనకాపూర్ లో నిర్మించ తలపెట్టిన ఆదర్శ అంగన్వాడి సెంటర్ కు జిల్లా కలెక్టర్ రాహుల్ రాజ్, అదనపు కలెక్టర్ చాహత్ బాజ్పేయి, జెడ్పి చైర్ పర్సన్ కోవలక్ష్మి, ఎమ్మెల్యే ఆత్రం సక్కు తో కలిసి భూమి పూజ చేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ అంగన్వాడి సెంటర్ల ద్వారా నాణ్యమైన వస్తువులు అందజేస్తున్నట్లు తెలిపారు. విద్యార్థులకు పూర్వ ప్రాథమిక విద్యలో అంగన్వాడీ కేంద్రాలు ఎంతో ప్రముఖ పాత్ర పోషిస్తున్నాయని తెలిపారు. ఆదర్శ అంగన్వాడి కేంద్రాల ద్వారా మరింత నాణ్యమైన సేవలు అందనున్నట్లు వివరించారు. ఈ కార్యక్రమంలో జెడ్పిటిసి నాగేశ్వర్ రావు, మార్కెట్ కమిటీ చైర్మన్ గాదేవేణి మల్లేష్, సింగల్ విండో చైర్మన్ అలిబిన్ అహ్మద్, పంచాయతీరాజ్ ఈఈ రామ్మోహన్ రావు, మహిళ శిశు సంక్షేమ శాఖ జిల్లా అధికారిని సావిత్రి, సంబంధిత శాఖ అధికారులు, తదితరులు పాల్గొన్నారు.