పురపాలక సాదారణ సమావేశం లో పలు అంశాలపై చర్చ లక్షేట్టిపేట, ఫిబ్రవరి 28, ప్రజాపాలన:

Published: Wednesday March 01, 2023

లక్షేట్టిపేట  పట్టణ పురపాలక కార్యాలయంలో మంగళ వారం  మున్సిపల్ చైర్ పర్సన్  నల్మాసు కాంతయ్య  అధ్యక్షతన మున్సిపల్ కౌన్సిల్ సాధారణ సమావేశం నిర్వహించారు. ఈ సమావేశములో హరిత హరం 2023-24 ఆర్థిక సం,, నకు గాను కార్యాలయము లోని నర్సరీ, వీకర్ సెక్షన్ వద్ద నర్సరీ  సత్య సాయి నగర్ లోని నర్సరీలకు గ్రీన్ షెడ్ ఏర్పాటు, రెండు పారిష్యుద్ద వాహనముల రిపేర్,   డంపింగ్ యార్డ్ వద్ద  వీకర్ సెక్షన్ వద్ద నూతనంగా నిర్మాణం చేసిన రోడ్డు డివైడర్ మధ్యలో మోరం పోసి మొక్కలు నాటుట గురించి చర్చించి ఆమోదించారు ఈ కార్యక్రమము లో మున్సిపల్ కమిషనర్ ఆకుల వెంకటేష్ ,  కౌన్సిల్ సభ్యులు , కో ఆప్షన్ సభ్యులు,  మున్సిపల్ మేనేజర్ శ్రీహరి  రాజశేఖర్ మున్సిపల్ ఇంజనీర్ ఎం.శ్రుతి వర్క్ ఇన్స్పెక్టర్ , ఎన్విాన్మెంటల్ ఇంజనీర్  మరియు సిబ్బంది పాల్గొన్నారు.