మధిర నియోజకవర్గ పరిధిలో అన్ని మండలాల్లోఅద్వానంగా ఆర్ అండ్ బి రహదారులు

Published: Tuesday December 14, 2021
మధిర డిసెంబర్ 13 ప్రజాపాలన ప్రతినిధి : మధిర నియోజకవర్గ పరిధిలో మండల గ్రామ పరిధిలోప్రమాదాలకు గురి అవుతున్న వాహనదారులు మధిర డివిజన్లో రహదారులు భవనాల శాఖకు సంబంధించిన అనేక రహదారులు గుంతలమయంగా మారాయి. ప్రధాన రహదారులపై సైతం భారీ స్థాయిలో గుంతలు ఏర్పడటంతో అనేక సార్లు ప్రమాదాలు జరిగి కొందరు మృత్యువాత గురికాగా మరికొందరు తీవ్రగాయాలతో బయట పడ్డారు. మధిర వైరా ప్రధాన రహదారిపై ఆత్కూరు సమీపంలో అడుగు లోతులో గుంతలు ఏర్పడి అనేక ప్రమాదాలు జరిగాయి. ఇదే రహదారిపై బోనకల్లు మండలం మండలం కలకోట బ్రాహ్మణపల్లి గ్రామాల వద్ద అనేక సంవత్సరాలుగా గుంతల ఏర్పడి ప్రమాదాలు జరిగాయి. అయినా కూడా ఆర్ అండ్ బీ శాఖ అధికారులు పట్టించుకోవడం లేదు. కొద్దికాలం క్రితం రహదారిపై మట్టితో మరమ్మతులు చేపట్టగా ఇటీవల కురిసిన వర్షాలకు మట్టి కొట్టుకొని కాకపోవడంతో మళ్ళీ కొత్తగా గుంతలు ఏర్పడ్డాయి. ఇది ఇలా ఉండగా గ్రామాలకు వెళ్ళే అనేక లింక్ రోడ్లు సైతం అధ్వానంగా ఉన్నాయి. మధిర నుండి బయ్యారం వెళ్లే రహదారి, అల్లినగరం వెళ్లే రహదారి ధ్వంసమైంది. బోనకల్ మండలం రావినూతల మీదగా పొద్దుటూరు వెళ్లే రహదారి, తూటికుంట్ల నుండి గొల్లపూడి వెళ్లే రహదారి అనేక సంవత్సరాలుగా మరమ్మతులకు నోచుకోవడం లేదు. దీంతో ఆ రహదారిపై ప్రయాణం చేయాలంటే ప్రజలు నరకయాతన పడుతున్నారు. ఇప్పటికైనా అధికారులు స్పందించి రహదారులకు మరమ్మత్తులు చేపట్టాలని ప్రజలు కోరుతున్నారు.