చల్లబడిన మధిర అసని తుఫాను తో మధిరలో చిరు జల్లులు

Published: Thursday May 12, 2022
మధిర మే 11 ప్రజా పాలన ప్రతినిధి మున్సిపాలిటీ పరిధిలో బుధవారం నాడు ఆగ్నేయ బంగాళాఖాతంలో ఏర్పడిన అసని తుఫాను కారణంగా మధిర పట్టణం చల్లబడింది మొన్నటి మధిర పట్టణంలో 42 డిగ్రీల ఉష్ణోగ్రత ఉండగా అసని తుఫాను కారణంగా మధిర పట్టణం ఒక్కసారిగా చల్లబడింది. ఇప్పటివరకు ఉక్కపోతకు గురైన ప్రజలు తుపాన్ కారణంగా చల్లబడటంతో ప్రజలు ఉపశమనం  పొందుతున్నారు. దీనికి తోడు చిరుజల్లులతో కూడిన వర్షం కూడా ప్రారంభమైనది