మేము సైతం వరద బాధితులు కోసం మధిర

Published: Monday August 01, 2022

జూలై 31 ప్రజాపాలన ప్రతినిధి మున్సిపాలిటీ పరిధిలో ఆదివారం నాడు  ప్రస్తుతం వర్షాలు బాగా ఉండి గోదావరి పరివాహక ప్రాంతాలు నీట మునిగిన ఎన్నో గిరిజన కుటుంబాల బిడ్డ గోడు అంత ఇంత కాదు.  వీరి దయనీయ పరిస్థితి చూసి చలించి రాష్టంలో పేరు గాంచిన టీఎస్ యుటిఎఫ్ వరద బాధితుల సహాయం నిమిత్తం సేకరించిన విరాళాలతో పాత బట్టలు సేకరణలో అనేక మంది దాతలు ముందు కొచ్చారు. ఇవి కాక గత 10 ఏళ్ళు గా నడుస్తూ న్న మహాత్మా గాంధీ ఓల్డ్ క్లాత్ బ్యాంక్ నుండి ప్రముఖ సామాజిక సేవకుడు (లంకా సేవ ఫౌండేషన్ నిర్వహు కులు) లంకా కొండయ్యకు మేము సైతం వరద బాధితులు కోసం మానవతాదృక్పధంతో  మధిర పురప్రముఖులు అనేక మంది వారిలో ప్రముఖ ఆర్య వైశ్య కుటింభికులు  కురువెళ్ల కృష్ణ దంపతులు  మరియు అమ్మవారి కళ్యాణ మండపం సభ్యులు దొడ్డ శ్రీనివాస రావు . వేముల ఆంజనేయులు అబోతు గిరి ప్రసాద్ కొల్లా ప్రసాద్ రావు  కొల్లా శ్రీనివాసరావు వెలివెల శ్రీధర్ వ్యవసాయశాఖ  ఏవో అనిల్ కుమార్ విశ్రాంత ఉపాధ్యాయ లు జి నారాయణ  ఇంకా అనేక మంది దాతలు ముందు కొచ్చి వస్త్రాలు వితరణ గా ఇవ్వ గా వీటిని టి ఎస్్ యు ఎఫ్ బృందం నకు అందించగా వారు వరద బాధితులకు స్వంత ఖర్చులు తో ఏజెన్సీ ప్రాంతంలో ఉన్న గిరిజనులకు అందించి మానవత్వoను చాటుకున్నారు.

 ఈ కార్యక్రమంలో తన వంతుగా మేము సైతం వరద బాధితులకు కోసం అంటూ ముందు కొచ్చిన దాతలకు  కొండయ్యకు వాలంటర్ పేరునా హృదయ పూర్వక అభినందనలు తెలిపారు. అలాగే ఈ మహాత్మాగాంధీ ఉచిత పాత బట్టల కేంద్రం సర్వీస్ గురించి సమాజంనకు మీడియా పరంగా తమ వంతు గా ప్రింట్ మరియు  ఎలక్ట్రానిక్ మీడియా మరియు సోషల్ మీడియా గౌరవ పాత్రికేయులుకు పేరు పేరునా శిరస్సు వంచి నమస్కారం చేస్తూన్నట్లు లంకా కొండయ్య ప్రేమ పూర్వకoగా కృతజ్ఞతలు తెలుపుతున్నారు. ఈ కార్యక్రమంలో లంకా సేవా ఫౌండేషన్ వాలంటీర్లు అంజి గోపి సన్నీ పండు కరుణ లియోనా అది మూలం వెంకటేష్ తదితరులు పాల్గొన్నారు.