కుమ్మరి శాలివాహన కులవృత్తులను ప్రోత్సహించాలి

Published: Friday October 29, 2021
జిల్లా వెనుకబడిన తరగతుల అభివృద్ధి అధికారిణి పుష్పలత
వికారాబాద్ బ్యూరో 28 అక్టోబర్ ప్రజాపాలన : వికారాబాద్ జిల్లాలోని కుమ్మరి శాలివాహన కులవృత్తుల వారిని ప్రోత్సహించడానికి తెలంగాణ కుమ్మరి శాలివాహన కో–ఆపరేటివ్ సొసైటీ ఫెడరేషన్ లిమిటెడ్ హైదరాబాద్ వారి ఆధ్వర్యంలో ఉచిత నైపుణ్యత శిక్షణ ఏర్పాటు చేయనున్నట్లు జిల్లా వెనుకబడిన తరగతుల అభివృద్ధి అధికారిని పుష్పలత గురువారం ఒక ప్రకటనలో తెలియజేసినారు. 5 ఇంచుల కంటే ఎక్కువ ఎత్తు కల్గిన మట్టి వినాయకుల తయారీ పై శిక్షణకు అర్హతలు: ఆదాయం రూ.1.50  గ్రామీణ ప్రాంతం, రూ. 2 లక్షలు పట్టణ ప్రాంతం వారు మాత్రమే అర్హులు. వయస్సు 21సం. నుండి 40 సంవత్సరాలలోపు వారు మాత్రమే అర్హులు. మీ సేవా ద్వారా కులం సర్టిఫికెట్. మీ సేవా ద్వారా ఆదాయం సర్టిఫికెట్. ఆధార్ కార్డు. పై శిక్షణ తరగతులకు ఆసక్తి కలిగిన కుమ్మరి శాలివాహన కుల వృత్తులవారు వారు వారి కులవృతిలో అనుభవం కలిగి ఉండాలి. గతములో శిక్షణ పొందిన లోకల్ ట్రైనర్ మరియు మాస్టర్ ట్రైనర్లు ఈ శిక్షణకు అనర్హులు. ఆసక్తి కల్గిన అబ్యర్ధులు వారి యోక్క దృవీకరణ పత్రాలను కలెక్టర్ కార్యాలయం బురుగుపల్లి బి.సి వెల్ఫేర్  ఆఫీస్ రూమ్ నెంబర్ 09 యందు 02-11-2021 వరకు అందజేయగలరని వారు కోరారు.