తాలు పేరుతో రైతుల దోపిడి.

Published: Thursday May 20, 2021

రైతుల సమస్యల పై  జెసి కి వినతి .
బిజెపి జిల్లా అధ్యక్షులు  రఘునాథ్.

మంచిర్యాల, మే 19, ప్రజాపాలన ప్రతినిధి : ఒకచేత. రైతు బంధు ఇస్తన్నామంటూ మరో చేత్తో తాలు పేరుతో రైతు పంటను దోపిడీ చేస్తున్నారని బిజెపి జిల్లా అధ్యక్షులు రఘునాథ్ విమర్శించారు. బుధవారం మంచిర్యాల జిల్లా కేంద్రంలోని కలెక్టర్ కార్యాలయంలో జిల్లా జాయింట్ కలెక్టర్ మధుసూదన్ నాయక్ ని కలిసి రైతులకు సంబంధించిన సమస్యల పై వినతి పత్రం ఇచ్చారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ రైతులు నిద్రాహారాలు మానేసి పండించిన పంటను అమ్ముకుందామని ఐకెపి సెంటర్లో కి తీసుకొస్తే, ఇప్పటికీ నెల రోజులు గడుస్తున్నా కేవలం 40 శాతం మాత్రమే కొనుగోలు చేయడం జరిగిందని పేర్కొన్నారు. అంతేకాకుండా వేమనపల్లి, కోటపల్లి, నేన్నెల, దండేపల్లి ఇలా దూరం ఉన్నటువంటి ఐకెపి కేంద్రాల్లో కి లారీలు రావడం లేదని రైతులు ఎంత చెప్పినా అధికారులు పట్టించుకోవడం లేదని అన్నారు. రైతులు పండించిన ఒక క్వింటాల్ వడ్ల లో 10 నుంచి 12 శాతం వరకు తరుగు పేరుతో కోత విధించడం జరుగుతుందని, అంతే కాకుండా లారీల్లో లోడ్ చేయడానికి రైతుకు తొమ్మిది రూపాయలు ఖర్చు అవుతున్నదని అన్నారు. గోనే సంచులు, తాడు మొదలైనవన్నీ కూడా రైతే భరించాల్సిన అటువంటి పరిస్థితి వచ్చిందని పేర్కొన్నారు. ఈ ఖర్చులను రాష్ట్ర ప్రభుత్వమే భరించాలని బిజెపి డిమాండ్ చేస్తుందాని పేర్కొన్నారు. రైతులకు ఐకేపీ సెంటర్లలో కనీసమైన మౌలిక వసతులను కూడా ఏర్పాటు చేయలేదని అన్నారు. ఈ కార్యక్రమంలో బీజేవైఎం రాష్ట్ర అధికార ప్రతినిధి తులా ఆంజనేయులు, బీజేవైఎం జిల్లా అధ్యక్షుడు వెంకటకృష్ణ, తదితరులు పాల్గొన్నారు