రైతులకు అన్యాయం జరుగుతున్న చూస్తూ ఊరుకున్న ప్రభుత్వం

Published: Monday May 30, 2022

ఇబ్రహీంపట్నం మే తేది 29  ప్రజాపాలన ప్రతినిధి.

రంగారెడ్డి జిల్లా యాచారం మండల పరిధిలో తెలంగాణ రైతు సంఘం పిలుపు మేరకు యాచారం మండల కమిటీ  ఆధ్వర్యంలో విలేకరుల సమావేశం ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా రైతు సంఘం జిల్లా అధ్యక్షులు మధుసూదన్ రెడ్డి మాట్లాడుతూ, తెలంగాణ రాష్ట్రం ఏర్పడితే రైతులకు ఎన్నో విధాలుగా మంచి జరుగుతుందని  చెప్పి గద్దెనెక్కిన తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం నేడు రైతులను చులకనగా చూస్తుంది అని తెలంగాణ సాయుధ పోరాటంలో సాధించుకున్న భూములను అసైన్డ్ భూముల్లో , పి ఓ టి కింద తీసుకున్న ప్రభుత్వ భూములకు రైతుబంధు, రైతు బీమా గత పాత కొత్త రికార్డులను తీసి వేశారని, కుటుంబంలో చనిపోయిన వ్యక్తికి వారసులుగా ఉన్న విరాసత్ గా ఎన్నోసార్లు అర్జీ పెట్టుకున్న పెట్టుకున్న ఫలితం లేదన్నారు. కలెక్టర్ కు ఎన్నోసార్లు విన్నవించుకున్న గాని పై రవిగార్ల లను ఆశ్రయిస్తే వేలల్లో ఖర్చు అవుతుందని తెలిపారు. ఈనెల 30 తేదీన జరగబోయే రైతాంగ పోరాటానికి ఎమ్మార్వో  ఆఫీస్ వద్దకు మండలంలోని అన్ని గ్రామాల రైతులు పెద్ద ఎత్తున హాజరు కావాలన్నారు. తహసిల్దార్ వద్ద సమస్య తీరకపోతే కలెక్టర్  కార్యాలయాన్ని ముట్టడి ఇస్తామని తెలిపారు. ఈ కార్యక్రమంలో ధర్మన్నగూడ సర్పంచ్ భాషయ్య, రైతు సంఘం మండల అధ్యక్షుడు తావు నాయక్, ఎం పీ నరసింహ, హనుమంతు, అంజయ్య, పి రమేష్, బాల్ రాజ్, రమేష్ తదితరులు పాల్గొన్నారు.