ఘనంగా ఛత్రపతి శివాజీ వర్ధంతి

Published: Monday April 04, 2022
ఆసిఫాబాద్ జిల్లా ఏప్రిల్ 03 (ప్రజాపాలన, ప్రతినిధి) : మహావీర పరాక్రమవంతుడు, ధర్మ పోరాట యోధుడు, చత్రపతి శివాజీ మహారాజ్ వర్ధంతిని, బీసీ సంక్షేమ సంఘం జిల్లా అధ్యక్షులు డాక్టర్ రూప్నర్ రమేష్ ఆధ్వర్యంలో బీసీ సంఘం నాయకులు ఘనంగా జరుపుకున్నారు. ఆదివారం జిల్లా కేంద్రంలోని చత్రపతి భవన్ వద్ద శివాజీ మహారాజ్ విగ్రహానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు. ఈ సందర్భంగా జిల్లా అధ్యక్షులు రూప్నర్ రమేష్ మాట్లాడుతూ మహావీర పరాక్రమవంతుడు ధర్మ పోరాట యోధుడు వీర శివాజీ అని, దేశం కోసం, ధర్మం కోసం పోరాడి, అసువులు బాసిన చత్రపతి శివాజీ మహారాజ్ పోరాట స్ఫూర్తితో ధర్మ రక్షణకై యువత పోరాడాలని అన్నారు. ఈ కార్యక్రమంలో బీసీ రైతు సంఘం జిల్లా అధ్యక్షుడు వైరగాడే మారుతి పటేల్, ఉపాధ్యక్షులు పురుషోత్తం బాలేష్, యువజన జిల్లా అధ్యక్షుడు ప్రణయ్ కుమార్, నాగరాజు, ప్రశాంత్, రాకేష్, సంఘం నాయకులు తదితరులు పాల్గొన్నారు.