ఆదిభట్ల మున్సిపాలిటీ కార్యవర్గ సమావేశం

Published: Thursday July 22, 2021

ఆదిభట్ల, జులై 21, ప్రజాపాలన ప్రతినిధి : హాజరైన రాష్ట్ర పార్టీ నాయకులు యాదయ్య గౌడ్. నియోజకవర్గ ఇన్చార్జి కొత్త అశోక్ గౌడ్. హాజరయ్యారు. ఈ కార్యక్రమం శిగ వీరస్వామి గౌడ్ అధ్యక్షతన జరిగింది. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా పో రెడ్డి నరసింహారెడ్డి హాజరై మాట్లాడుతూ, అర్హులైన కుటుంబాలకు రేషన్ కార్డులు, కొత్త పెన్షన్ లు 57 సంవత్సరాల వారికి ఇవ్వాలన్నారు. రెండు సంవత్సరాల నుండి గడుస్తున్నా ఆ ఊసే లేదు. తద్వారా వృద్ధులు, వితంతువులు, వికలాంగులు ప్రభుత్వ యొక్క నిరాదరణకు గురవుతున్నారు. మున్సిపాలిటీ పరిధిలో రామదాస్ పల్లిలో. క్రషర్ మిల్లులు నిబంధనలకు విరుద్ధంగా అక్రమ మైనింగ్ పనులు జరుగుతున్నాయి. మున్సిపాలిటీ పరిధిలో రైతులు వారు పండించిన పంటకు మార్కెట్ చేసుకోవడం కోసం సరైన ప్రాంతంలో మార్కెట్ వసతి కల్పించాలను, వారి యొక్క రైతు రుణమాఫీ తక్షణమే అమలు చేయాలి ఐకేపీ సెంటర్ నీ తక్షణం ఏర్పాటు చేయాలి. మున్సిపాలిటీ పరిధిలో అర్హులైన దళిత గిరిజన, బిసి యువకులకు ఆయా కార్పొరేషన్ల నుండి సబ్సిడీ రుణాలు ఇచ్చి వారికి ఆర్థిక చేయూత కల్పించాలి. డ్వాక్రా మహిళలకు పాత వడ్డీని రుణాలకు సంబంధించిన వడ్డీని రాష్ట్ర ప్రభుత్వం విడుదల చేయాలి. మైనార్టీ సంబంధించిన వక్ఫ్ బోర్డు భూముల పైన శ్వేతపత్రం విడుదల చేయాలని వాటిని అన్యాక్రాంతం కాకుండా చర్యలు తీసుకోవాలి. కలెక్టర్ బిల్లు తరగతిన పూర్తి చేసి అందుబాటులోకి తీసుకురావాలి ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో అసెంబ్లీ కన్వీనర్ నాహిని సత్యనారాయణ. బిజెపి ప్లోర్ లీడర్ పొట్టి రాములు. జిల్లా కార్యవర్గ సభ్యులు పో రెడ్డి అర్జున్ రెడ్డి. ఎస్సీ మోర్చా జిల్లా అధ్యక్షులు పచ్చ గల రమేష్. రాష్ట్ర సోషల్ మీడియా కన్వీనర్ కొండ్రు పురుషోత్తం. ఈ కార్యక్రమంలో తదితరులు పాల్గొన్నారు