వైఎస్ఆర్ టిపిని బలోపేతం చేయాలి

Published: Tuesday January 31, 2023
* వైఎస్ఆర్ టిపి రాష్ట్ర పరిశీలకులు బండారి అంజన్ కుమార్ రాజు
వికారాబాద్ బ్యూరో 30 జనవరి ప్రజా పాలన : వైఎస్ఆర్ తెలంగాణ పార్టీని బూతు స్థాయిలో బలోపేతం చేసేందుకు ప్రతి కార్యకర్త కృషి చేయాలని వైఎస్ఆర్ టిపి రాష్ట్ర పరిశీలకులు బండారి అంజన్ కుమార్ రాజు పిలుపునిచ్చారు. సోమవారం జిల్లా కేంద్రంలో జిల్లా అధ్యక్షుడు మామిడి సంగమేశ్వర్ వికారాబాద్ నియోజకవర్గ కో ఆర్డినేటర్ ఉప్పరి ప్రసాద్ ఆధ్వర్యంలో వైఎస్ఆర్ తెలంగాణ పార్టీ కార్యాలయాన్ని జెండా ఆవిష్కరణ చేసి ప్రారంభించారు. ఈ సందర్భాన్ని పురస్కరించుకొని రాష్ట్ర పరిశీలకులు బండారి అంజన్ కుమార్ రాజు మాట్లాడుతూ రాబోవు అసెంబ్లీ ఎన్నికల్లో వైఎస్ఆర్ తెలంగాణ పార్టీ ఎమ్మెల్యేలను భారీ మెజారిటీతో గెలిపించి తొలి మహిళా ముఖ్యమంత్రిగా వైఎస్ షర్మిలను చూద్దామని ఆకాంక్షించారు. బిఆర్ఎస్ పార్టీ అసమర్థ పాలనను ఎప్పటికప్పుడు ఎండగట్టాలని ధ్వజమెత్తారు. కెసిఆర్ కుటుంబ పాలనకు ప్రజలు త్వరలో బుద్ధి చెప్పనున్నారని జోస్యం చెప్పారు. వైఎస్ఆర్ తెలంగాణ పార్టీ వ్యవస్థాపకురాలు వైఎస్ షర్మిల చేపట్టిన పాదయాత్రకు విశేష స్పందన లభిస్తుండడం గర్వించదగిన విషయమని స్పష్టం చేశారు. ఏ ప్రాంతానికి వెళ్లిన ప్రజలు బ్రహ్మరథం పడుతున్నారని వివరించారు. వికారాబాద్ అసెంబ్లీ కోఆర్డినేటర్ ఉప్పరి ప్రసాద్ మాట్లాడుతూ ప్రతి కార్యకర్తను సమన్వయ పరుస్తూ కార్య దీక్షతో ఒక సైనికుడిలా కృషి చేస్తానని విశ్వాసం వ్యక్తం చేశారు. వైఎస్ షర్మిల ఏ క్షణంలో ఏ సమయంలో పార్టీని పెట్టారో అప్పటినుండి కెసిఆర్ ప్రభుత్వానికి బీటలు కదులుతున్నాయని ఘాటుగా స్పందించారు. ఎమ్మెల్యేలకు మంత్రులకు సీఎం కేసీఆర్ ను కలిసి  నియోజకవర్గ సమస్యలను చెప్పేందుకు అవకాశం ఇవ్వడం లేదని విమర్శించారు. ఒక నియంతలా తెలంగాణ రాష్ట్రంలో రాచరిక పాలన చేస్తున్నాడని ధ్వజమెత్తారు. పార్టీ అంటేనే కార్యకర్తలు రాజకీయ ప్రతినిధులు అందరి అభిప్రాయాలను తీసుకొని పాలన కొనసాగించాల్సి ఉంటుందని చెప్పారు. సీఎం కేసీఆర్ నేనే మంత్రి నేనే రాజు నేనే ప్రజలుగా భావిస్తూ మూర్ఖంగా పాలన కొనసాగిస్తున్నాడని విమర్శించారు. ఈ కార్యక్రమంలో వైఎస్ఆర్ నియోజకవర్గ అధికార ప్రతినిధి వసంత్ కుమార్ వికారాబాద్ యూత్ ప్రెసిడెంట్ వేణుగోపాల్ సోషల్ మీడియా ఇన్ఛార్జ్ శశివర్ధన్ ఎస్సీ సెల్ మండల అధ్యక్షుడు కుమార్ తదితర వైఎస్ఆర్ తెలంగాణ పార్టీ కార్యకర్తలు హితైషులు అభిమానులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.